Begin typing your search above and press return to search.

అన్న కొడుకు తో అల్లు హీరో బర్త్ డే

By:  Tupaki Desk   |   1 Jun 2017 7:15 AM GMT
అన్న కొడుకు తో అల్లు హీరో బర్త్ డే
X
టాలీవుడ్ మోస్ట్ ఫేమస్ స్టార్ కిడ్స్ లో హీరో అల్లు అర్జున్ కొడుకు అయాన్ కూడా ఒకడు. అయాన్ పుట్టినప్పుడు అల్లు అర్జున్ తన ట్విటర్ లో పిక్ పోస్ట్ చేసినప్పటి నుండి అయాన్ ఫోటోలుకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అదేకాకుండా బన్నీ సోషల్ మీడియా లో చాలా చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాడు. సందర్భం ఏదైనా ఫోటోలో సెంటర్ పాయింట్ మాత్రం అల్లు అర్జున్ కొడుకే అవ్వడం ఒక ట్రెండ్ లా మారింది.

ఇప్పుడు కూడా తన బాబాయి పుట్టినరోజు వేడుకలో కేక్ కట్ చేయడంలో హెల్ప్ చేస్తూ బాబాయికి అల్లు ఫాన్స్ కు మంచి స్వీట్ మెమరీ మిగిల్చాడు. అన్నగారి అబ్బాయి ప్రేమకు బాబాయి ఒక అడుగు వెనకకు వెళ్ళి ఆ ఆనందాన్ని ఇలా తన అన్నయ్య అర్జున్ వదిన స్నేహ సమక్షంలో తన 30 వ పుట్టిన రోజును జరుపుకున్నాడు. దువ్వాడ జగన్నాధం సినిమా తో అర్జున్ ఇప్పుడు బిజీగా ఉంటూనే తమ్ముడు కోసం ఇలా కొంత టైమ్ తీసుకొని.. వేడుక లో భాగమై.. శిరీష్ కు తన కొడుకుతో కలిసి ప్రేమను గిఫ్ట్ గా ఇచ్చాడు కదూ.

ఇప్పుడు అల్లు శిరీష్ ఇప్పుడు 1971 భారత సరిహద్దు సినిమా డబ్బింగ్ పనులలో ఉన్నాడు. ఈ సినిమాలో ప్రముక మలయాళం మెగా స్టార్ మోహన్ లాల్ తో కలిసి నటించాడు. మలయాళంలో సినిమా ఫ్లాపైనా తెలుగులో సినిమాను రిలీజ్ చేస్తారట. ఇకపోతే ఎక్కడకి పోతావు చిన్నవాడ ఫేమ్ డైరెక్టర్ వి ఆనంద్ తో ఒక సినిమా జరుగుతోంది. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/