Begin typing your search above and press return to search.

జూనియర్ బన్నీ.. వాటే యాక్టర్!!

By:  Tupaki Desk   |   12 Jun 2017 4:19 AM GMT
జూనియర్ బన్నీ.. వాటే యాక్టర్!!
X
గత రాత్రి జరిగిన ''డిజె దువ్వాడ జగన్నాథమ్'' ఆడియో లాంచ్ లో చాలా ఇంట్రస్టెంగ్ విషయాలు కొన్ని చోటుచేసుకున్నాయి. అయితే అన్నింటికంటే ముఖ్యంగా.. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆడియో లాంచ్ జరుగుతుంది అనుకుంటే.. ఇక్కడ మాత్రం అల్లు అరవింద్ మనవడు.. దిల్ రాజు మనవడు చేతుల మీదుగా తొలి సిడి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ గురించి చాలా చెప్పుకోవాలి.

యాక్టింగ్ బ్లడ్ లో ఉందా లేదా అంటే చెప్పలేం కాని.. రోజూ ఇంట్లో యాక్టర్లను చూస్తుంటే మాత్రం.. ఖచ్చితంగా వాళ్ళకు యాక్టింగ్ అండ్ ఎమోటింగ్ బాగా అలవాటైపోతుందనే అనుకోవాలేమో. అసలు అల్లు అర్జున్ కొడుకు ఎంతటి చిచ్చర పిడుగు అంటే.. వచ్చీ రాగానే మనోడ్ని హీరోయిన్ పూజా హెగ్డే కు హ్యాండ్ షేక్ ఇవ్వమని అంటే.. ఈ పిల్లోడు మాత్రం స్టేజీ మీద ఏదో ప్రోగ్రామ్ చూస్తూ.. అస్సలు తల కూడా తిప్పలేదు. హీరోయిన్ ను పట్టించుకోలేదు. తన తల్లి స్నేహా రెడ్డి ఒడిలో కూర్చొని.. ఏదన్నా సాంగ్ లాంచ్ చేసినప్పుడు మాత్రం.. హోరెత్తించే సౌండ్ ను తట్టుకోలేక చెవులకు చేతులు అడ్డుపెట్టేసుకున్నాడు. ఎవరు తీయమన్నా కూడా తీయలేదు.

ఆ తరువాత స్టేజ్ మీదకు తీసుకురాగానే సీన్ మారింది. అందరికీ హాయ్ చెప్పు నానా అంటే.. ముందు చెయ్యూపాడు కాని.. తరువాత ఏకంగా రెండు చేతులూ పైకెత్తి దణ్ణం పెట్టేశాడు. అవన్నీ ఖచ్చితంగా అల్లు అర్జున్ చూస్తే ఇమిటేట్ చేస్తూ చేసినవే అని చెప్పుకోవాలి. అంటే ఇప్పటినుండే ఈ పిల్లడు మాంచి యాక్టర్ అయిపోతున్నాడు అనమాట. ఆ విధంగా బన్నీ కొడుకు సెంటరాఫ్‌ ఎట్రాక్షన్ అయిపోయాడులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/