Begin typing your search above and press return to search.

బ్యాచిలర్ గురించి అల్లు అరవింద్ కూడా అదే మాట

By:  Tupaki Desk   |   18 Oct 2021 5:13 AM GMT
బ్యాచిలర్ గురించి అల్లు అరవింద్ కూడా అదే మాట
X
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా దసరా సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. దసరాకు మూడు సినిమాలు రాగా అందులో రెండు సినిమాల విషయంలో ప్రేక్షకులు మరియు రివ్యూవర్స్ పెదవి విరిచారు. కాని బ్యాచిలర్ ను మాత్రం ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. అందుకు సాక్ష్యం భారీ వసూళ్లు అనడంలో సందేహం లేదు. పెద్ద ఎత్తున అంచనాలున్న మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ కు చేరువ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ఓవర్సీస్ లో కూడా మిలియన్ డాలర్ల వైపుకు పరుగులు తీస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు యూఎస్ బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలు మాత్రమే మిలియన్‌ డాలర్లను రాబట్టాయి. మూడవ సినిమాగా బ్యాచిలర్‌ నిలిచాడు. సినిమా మరో వారం లేదా రెండు వారాల పాటు జోరుగా వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు నమ్మకంగా ఉన్న సమయంలో ఈ సినిమా ఆహా స్ట్రీమింగ్ నవంబర్ లో అంటూ వార్తలు మొదలు అయ్యాయి.

స్ట్రీమింగ్‌ ఆలస్యం లేదు కనుక ప్రయాస పడి థియేటర్‌ లో చూడాల్సిన అవసరం ఏంటీ అని కొందరు ఫ్యామిలీ ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉంది. అందుకే వెంటనే నిర్మాతలు బ్యాచిలర్‌ ను ఇప్పట్లో ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ చేసేది లేదు అంటూ తేల్చి చెప్పారు. ఇప్పటికే బన్నీ వాసు సోషల్‌ మీడియా ద్వారా స్ట్రీమింగ్‌ గురించి వస్తున్న వార్తలను కొట్టి పారేశాడు. రెండు నెలల సమయం దాటిన తర్వాత మాత్రమే స్ట్రీమింగ్ కు బ్యాచిలర్‌ ను ఇస్తామంటూ అధికారికంగా ప్రకటించడం జరిగింది. తాజాగా అల్లు అవింద్ కూడా ఆ విషయమై స్పందించాడు. బ్యాచిలర్‌ ను వెంటనే ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని.. ఖచ్చితంగా కొన్ని నెలల తర్వాత మాత్రమే బ్యాచిలర్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఉంటుందని పేర్కొన్నాడు.

మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు వైజాగ్‌ లో సక్సెస్ వేడుక చేసుకున్నారు. ఆ వేడుకలో అఖిల్‌ మాట్లాడుతూ సినిమా ను ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అంటూ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. అఖిల్ కు ఒక మంచి కమర్షియల్‌ బ్రేక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు బ్యాచిలర్‌ తో ఆ కోరిక తీరినట్లయ్యింది అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 50 కోట్ల వసూళ్లను ఈ సినిమా లాంగ్ రన్ లో రాబట్టాలని అభిమానులు ఆశ పడుతున్నారు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే.

సినిమా చాలా విభిన్నమైన ఎంటర్ టైనర్‌ గా సాగి ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం కనెక్ట్‌ అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్‌ మొదటి మూడు సినిమా ల్లో రెండు కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా కూడా వసూళ్ల విషయంలో మాత్రం బ్యాచిలర్ తర్వాతే ఆ సినిమాలు అన్నట్లుగా నిలిచాయి. ఈ సినిమా విజయం నేపథ్యంలో ఖచ్చితంగా తదుపరి రాబోతున్న ఏజెంట్‌ పై అంచనాలు భారీగా పెరుగుతాయి. సురేందర్ రెడ్డి ఒక మంచి స్టైలిష్ డైరెక్టర్ అనడంలో సందేహం లేదు. ఆయన అఖిల్‌ ను ఒక మంచి స్టైలిష్‌ లుక్ లో ప్రజెంట్‌ చేయబోతున్నాడు. వచ్చే సమ్మర్ వరకు ఏజెంట్‌ ను రంగంలోకి దించుతారేమో చూడాలి.