Begin typing your search above and press return to search.

ఖైదీ 150కి భయపడ్డ అల్లు అరవింద్

By:  Tupaki Desk   |   12 Jan 2017 10:30 PM GMT
ఖైదీ 150కి భయపడ్డ అల్లు అరవింద్
X
మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 సాధిస్తున్న కలెక్షన్స్.. సృష్టిస్తున్న రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావనే విషయం కనిపిస్తూనే ఉంది. మెగాస్టార్ రీఎంట్రీకి రెస్పాన్స్ బాగుంటుందని ఇండస్ట్రీ అంతా ఊహించింది కానీ.. బాహుబలిని రికార్డులను దులిపేసే సినిమా అవుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల నుంచి వస్తున్న వసూళ్ల రిపోర్టులు మైండ్ బ్లాంక్ చేసేస్తున్నాయి.

చిరు 151వ సినిమా గీతా ఆర్ట్స్ లోనే అని గతంలోనే అల్లు అరవింద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా.. డాడీ నెక్ట్స్ మూవీ నేనే చేస్తా అన్నాడు చెర్రీ. దీంతో చిరు ఇంటే 151కోసం పోటీ మొదలైందా అనిపించింది. అయితే.. చిరంజీవి 151వ మూవీని తానే చేద్దామని అనుకున్నా.. ఇప్పటివరకూ కొన్ని కారణాలతో వాయిదా పడిందని చెప్పారు అల్లువారు. ''ఇప్పుడు ఖైదీ నంబర్ 150కి వస్తున్న స్పందన చూస్తుంటే.. నెక్ట్స్ ప్రాజెక్ట్ పై భయం వేస్తోంది. ఆరు నెలలు ఆగి అయినా సరే.. పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాం. ఈలోగా రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి సినిమా మరొకటి నిర్మాణం పూర్తి చేసుకుంటుంది'' అన్నారు అరవింద్.

సో.. 151కి రామ్ చరణ్.. చిరు 152కి అల్లు అరవింద్ నిర్మాత అనే విషయం తేలిపోయినట్లే. ఇక తేలాల్సింది ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారనే విషయమే. 152కు మాత్రం.. బోయపాటి శ్రీను అన్నట్లు ఒక హింట్ ఇచ్చారు అరవింద్. మరి 151 ఎవరితో? సురేందర్ రెడ్డి కన్ఫామా? లెటజ్ సీ.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/