Begin typing your search above and press return to search.

అల్లు అరవింద్ అప్పట్లోనే.. అబ్బో మామూలోడు కాదుగా!

By:  Tupaki Desk   |   13 Oct 2022 11:03 AM IST
అల్లు అరవింద్ అప్పట్లోనే.. అబ్బో మామూలోడు కాదుగా!
X
టాలీవుడ్‌ నిర్మాతల్లో మోస్ట్‌ కమర్షియల్‌ జీనియస్ గా అల్లు అరవింద్ ను చెప్పుకోవచ్చు. ఆయన నిర్మించిన సినిమాల్లో 80 శాతంకి పైగా సినిమాలు కమర్షియల్‌ గా సక్సెస్ ను దక్కించుకున్నవే అనడంలో సందేహం లేదు. హీరో స్టార్ డమ్ మరియు దర్శకుడి ప్రతిభ ఆధారంగా ఆయన ఖర్చు చేసి సినిమాకు ఖర్చు చేస్తాడు.

ఆయన నమ్మకంతో మగధీర సినిమాకు అప్పట్లోనే ఏకంగా 40 కోట్లు ఖర్చు పెట్టడం వల్లే ఇప్పుడు మన తెలుగు సినిమా పరిశ్రమ ఇలా ఉంది అనడంలో సందేహం లేదు. మగధీర సినిమా ను బాబోయ్ అంత ఖర్చు చేయలేను 20 కోట్లలో తీయమని రాజమౌళి తో ఆ రోజు అని ఉంటే కచ్చితంగా రాజమౌళి ఆ తర్వాత తర్వాత అద్భుతమైన సినిమాలను చేసేవారు కాదు.

తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో అల్లు అరవింద్‌ పాల్గొన్నాడు. ఆ సందర్భంగా పలు విషయాలను అల్లు అరవింద్‌ షో లో పంచుకున్నాడు. షో రెండు పార్ట్‌ లుగా టెలికాస్ట్‌ అయ్యింది. తాజాగా ప్రసారం అయిన ఎపిసోడ్‌ లో అల్లు అరవింద్‌ ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు.

మా నాన్న గారు ఎప్పుడు కూడా బాహాటంగా నన్ను పొగిడింది లేదు. కానీ ఒక సంఘటన బాగా గుర్తు ఉంది. నాన్న గారు చిన్నప్ప దేవర్‌ నిర్మాణంలో ఒక సినిమాను చేయాల్సి ఉంది. 12 వేలకు నటించాలని నిర్మాత అంటున్నారు.. నాన్న గారు 15 వేల రెమ్యూనరేషన్‌ ఇస్తేనే నటిస్తాను అంటున్నారు.

వారిద్దరి మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో సినిమా ప్రారంభం సమయంలో 12 వేల పారితోషికం తీసుకుని మళ్లీ ఆయనకు ఇచ్చేయండి. ఆ మొత్తం కు వడ్డీతో సహా సినిమా పూర్తి అయిన తర్వాత 15 వేలుగా మీకు ఇవ్వమనండి అంటూ అల్లు అరవింద్ అప్పట్లో అల్లు రామలింగయ్య కి ఫైనాన్సియల్ గా సలహా ఇచ్చాడట.

అదే విషయాన్ని నిర్మాత నిన్నప్ప దేవర్‌ వద్దకు అల్లు రామలింగయ్య గారు తీసుకు వెళ్లి చెప్పగా.. అద్భుతమైన ఐడియా అంటూ అదే విధంగా ముందుకు వెళ్లారు. అప్పుడే నిర్మాత చిన్నప్ప గారు నిన్ను కలవాలి అంటున్నాడు అంటూ నాన్న గారు నాకు ఫోన్ చేసి రమన్మారు. నేను అక్కడికి వెళ్తే చిన్నప్ప దేవర్‌ గారు నన్ను నా ఐడియా ను అభినందించారు అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. చిన్నప్పటి నుండే ఫైనాన్షియల్‌ గా అంతగా ఆలోచించేవాడు కనుకే ఇప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యంను ఏర్పాటు చేయగలిగారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.