Begin typing your search above and press return to search.

వావ్.. అల్లు శిరీష్‌ కు ఆడీ కార్‌ గిఫ్టిచ్చాడు

By:  Tupaki Desk   |   10 Oct 2016 1:45 PM GMT
వావ్.. అల్లు శిరీష్‌ కు ఆడీ కార్‌ గిఫ్టిచ్చాడు
X
ఈ మధ్యకాలంలో హీరోలు తమ డైరక్టర్లకు కార్లను గిఫ్టులు ఇస్తున్నారు. హ్యాపీ న్యు ఇయర్ సినిమాను పెద్ద సక్సెస్ చేసినందుకు స్టార్ హీరో షారూఖ్‌ ఖాన్ తన దర్శకురాలు ఫరా ఖాన్ కు మెర్సిడెస్ బెంజ్ కారు గిఫ్టిచ్చాడు. అలాగే శ్రీమంతుడుతో భారీ హిట్టు కొట్టినందుకు దర్శకుడు కొరటాల శివకు మహేష్‌ బాబు ఆడీ సెడాన్ ఒకటి గిఫ్టిచ్చాడు.

అయితే ఇప్పుడు తొలిసారిగా ఒక బ్లాక్ బస్టర్ రేంజ్ సక్సెస్ చూసిన తన కొడుక్కి ఓ నిర్మాత సేమ్ అదే తరహా గిఫ్టిచ్చాడు. దసరా పండుగ సందర్భంగా వాహనాలకు పూజలు చేయించడం తెలుగింట ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత.. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్.. తన కొడుకు అల్లు శిరీష్‌ ఒక ఆడి క్యూ 7 కారును గిఫ్టుగా ఇచ్చారు. కోటి రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ ఉన్న ఈ కార్ చిన్నప్పటి నుండి అల్లు శిరీష్‌ ఫేవరేట్ అంట. కాకపోతే ఒక సక్సెస్ కొట్టాకనే ఆ గిఫ్టును చేతిలో పెట్టాలని ఫీలైన అరవింద్.. శ్రీరస్తు శుభమస్తు మాంచి హిట్టయ్యాక ఇలా కొనిచ్చేశారు.

ఇకపోతే అల్లు శిరీష్‌ తదుపరి సినిమా ఏంటనేది ఇంకా ఫిక్సవ్వలేదు. ఇప్పటికే మొదలైన మల్లిడి వేణు సినిమా క్యాన్సిల్ కావడంతో.. తదుపరి ఏ సినిమా చేస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/