Begin typing your search above and press return to search.

అరుంధతి హిందీ రీమేక్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ టాలీవుడ్ నిర్మాత!

By:  Tupaki Desk   |   23 July 2020 1:30 AM GMT
అరుంధతి హిందీ రీమేక్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ టాలీవుడ్ నిర్మాత!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క శెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ సినిమాతో మొదలైన అనుష్క జర్నీ.. నిశ్శబ్దం వరకు విజయవంతంగా సాగుతూ వస్తుందంటే అందుకు కారణం ఆమె టాలెంట్. నటనలో ఆమె చూపించే వైవిద్యం ఆమెను నేడు ఈ స్థాయిలో ఉంచాయి. కానీ ఆమె సంపూర్ణ నటిగా నిరూపించుకుంది మాత్రం అరుంధతి సినిమాతోనే.. ఓ రకంగా చెప్పాలంటే అనుష్క కెరీర్ అరుంధతికి ముందు.. అరుంధతికి తర్వాత అనేంత ప్రభావం చూపించింది. స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ విసువల్ వండర్ గా బాక్సాఫీస్ షేక్ చేసింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఎన్నో అవార్డులను, రివార్డులను ఖాతాలో వేసుకుంది. కానీ నిన్న నేడు విడుదల అయిన సినిమాలే రేపు వేరే భాషలో రీమేక్ అవుతున్నాయి. మరి బాక్సాఫీస్ షేక్ చేసిన అరుంధతి సినిమా ఇంతవరకు వేరే భాషలో రీమేక్ కాకపోవడం గమనార్హం.

అనుష్క కెరీర్నే మలుపు తిప్పిన అరుంధతి.. ఓ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కి అనుష్కను స్టార్ చేసింది. అదిరిపోయే విఎఫ్ఎక్స్.. సినిమాటోగ్రఫీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. స్టోరీ.. ఇలా అన్నీ హైలైట్ గా నిలిచాయి. ఎన్నో ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను ఆ మధ్య హిందీలో రీమేక్ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత ఊసే లేదు. అయితే అరుంధతి రీమేక్ హక్కులను ఫాన్సీ ధరకు నిర్మాత అల్లు అరవింద్ దక్కించుకున్నారట. త్వరలోనే ఈ మూవీని హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ భారీ రీమేక్ మూవీని అల్లు అరవింద్ తో పాటు ఫాంటమ్ ఫిలిమ్స్ అండ్ బ్రాట్ ఫిలిమ్స్ మధు మంతెన కలిసి నిర్మించనున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హైలైట్ అవుతుండగా.. అరుంధతి పాత్రలో స్టార్ హీరోయిన్ దీపిక పదుకోనె నటించనుందని టాక్. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయట. అలాగే త్వరలో ఈ రీమేక్ మూవీ డైరెక్టర్, ఇతర వివరాలు వెల్లడిస్తారని సమాచారం.