Begin typing your search above and press return to search.

దిల్ రాజు - అల్లు అరవింద్... పరశురామ్ పంచాయితీ సెట్టా?

By:  Tupaki Desk   |   13 July 2023 6:20 PM GMT
దిల్ రాజు - అల్లు అరవింద్... పరశురామ్ పంచాయితీ సెట్టా?
X
ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్- దిల్ రాజు .. కొన్ని రోజుల క్రితం దర్శకుడు పరశురామ్ విషయంలో ఈ ఇద్దరి పేర్లు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచాయి. విజయ్ దేవరకొండ- పరశురామ్ కాంబినేషన్ లో సినిమా ప్రకటించినప్పుడు.. ఈ స్టార్ ప్రోడ్యూసర్స్ మధ్య గట్టిగానే మనస్పర్థలు వచ్చాయి. అయితే ఇప్పుడు వీరిద్దరు మళ్లీ ఒక్కటైనట్టు కనిపిస్తోంది. మనస్పర్తలు తొలిగిపోయి, వారి సమస్యలకు పరష్కారం దొరికినట్టు అర్థమవుతోంది.

వాస్తవానికి దర్శకుడు పరశురామ్.. సినిమా చేసేందుకు దిల్ రాజు కన్నా ముందు అల్లు అరవింద్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు. అంటే ముందుగా అరవింద్ కు సినిమా చేయాలి. కానీ అలా చేయకుండా దిల్ రాజు బ్యానర్ లో విజయ్ తో సినిమా ప్రకటించారు పరశురామ్. ఈ విషయంలో అల్లు అరవింద్ బాగా హర్ట్ అయ్యారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ పరశురామ్, దిల్ రాజు విషయాన్ని బయటపెట్టాలని అనుకున్నారు. కానీ కొంతమంది పెద్దలు ఎంటర్ అవ్వడంతో ప్రెస్ మీట్ పెట్టలేదు.

ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు కానీ అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య మాటలు లేవని ప్రచారం సాగింది. అయితే తాజాగా వీరిద్దరు ఒకే వేదికపై కనిపించి షాక్ ఇచ్చారు. అది కూడా సరదాగా ముచ్చటించుకుంటూ.. నేడు(జులై 13) జూనియర్ ఎన్టీఆర్ సొంత బావమరిది(ప్రణతి తమ్ముడు) నార్నే నితిన్ హీరోగా పరిచయం అవుతూ సినిమా అనౌన్స్ చేశారు. ఇది గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రూపొందుతోంది. అలాగే ఈ మూవీ ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా జరిగింది.

ఈ ఓపెనింగ్ వేడుకకు నిర్మాత దిల్ రాజు స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. సినిమా ఎలాగో అల్లు అరవింద్ ది. ఆయన కూడా ఈ వేడుకలో సందడి చేశారు. అలా ఒకే చోట కలిసిన వీరిద్దరు.. మళ్లీ కలిసిపోయి ఆనందంగా చేతులు కలుపుకున్నారు. సరదాగా కాసేపు ముచ్చటించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.

అల్లు అరవింద్ అయితే సరదాగా దిల్ రాజును కొడుతూ మాట్లాడారు. ఈ సన్నివేశాల్ని కెమెరాల్లో బంధీ అయ్యాయి. సినిమా అనౌన్స్ మెంట్ కన్నా వీరిద్దరే తమ చర్యలతో ఎక్కువ హాట్ టాపిక్ గా నిలిచారు. ఇక ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు నిర్మాతలు మధ్య వచ్చిన మనస్పర్థలతో ఇప్పట్లో కలుస్తారని ఎవ్వరూ అనుకోలేదు. మరి ఏం జరిగిందో తెలీదు కానీ ఇద్దరు మాత్రం బాగానే కలిసిపోయారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు, సమస్యలు తొలిగిపోయి ఉంటాయని అంతా అనుకుంటున్నారు.