Begin typing your search above and press return to search.

ఇకపై గ్యాప్ లేకుండా

By:  Tupaki Desk   |   15 Aug 2019 8:04 PM GMT
ఇకపై గ్యాప్ లేకుండా
X
ఎంతో కష్టపడి స్టార్డంని సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సినిమా, సినిమాకు ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ వచ్చాడు. అయితే 'నా పేరు సూర్య' సినిమా బన్నీ కి ఒక రకంగా బ్రేక్ వేసిందనే చెప్పాలి. సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో తదుపరి సినిమాల కోసం చాలా నెలలు గ్యాప్ తీసుకున్నాడు బన్నీ. మళ్లీ త్రివిక్రమ్ సినిమాతో మేకప్ వేసాడు. అయితే ఆ గ్యాప్ కి చాలా రీజన్స్ ఉన్నా ఫ్యాన్స్ మాత్రం స్టయిలిష్ స్టార్ సినిమాలను బాగా మిస్ అవుతున్నారు.

అందుకే ఈరోజు విడుదలైన 'అల వైకుంఠపురములో' గ్లిమ్స్ లో తన గ్యాప్ పై తనే చెప్పుకున్నాడు. ఏంట్రాయ్ గ్యాప్ ఇచ్చావ్ అని మురళి శర్మ అడగ్గా ఇవ్వలేదు. వచ్చింది అంటూ అనుకోకుండా వచ్చిన గ్యాప్ గురించి చెప్పాడు బన్నీ. ఈ డైలాగ్ లో ఇన్నర్ ఫీలింగ్ తో ఇకపై స్పీడ్ పెంచేస్తానాని చెప్పకనే చెప్పారు. ఆ డైలాగ్ డెలివరీ చూస్తే ఆ సంగతి ఇట్టే గమనించొచ్చు.

ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' సినిమా చేస్తున్న బన్నీ నెక్స్ట్ సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఆ సినిమాను కొంత కంప్లీట్ చేసి ఐకాన్ సినిమాను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు మెగా హీరో. ఈ మూడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో గ్యాప్ ని మర్చిపోయేలా ఎంటర్టైన్ చేయనున్నాడు స్టయిలిష్ స్టార్. మరి ఈ మూడు సినిమాలతో బన్నీ ఎలాంటి హిట్సా కొడతాడన్నది చూడాలి.