Begin typing your search above and press return to search.

తిరుమ‌లేశుని చెంత బ‌న్ని ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   7 Feb 2020 9:30 AM GMT
తిరుమ‌లేశుని చెంత బ‌న్ని ఫ్యామిలీ
X
`అల వైకుంఠ‌పుర‌ములో` గ్రాండ్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ గురించి తెలిసిందే. సంక్రాంతి పందెంలో నువ్వా నేనా అంటూ సాగిన పోరులో చివ‌రికి అల.. పై చేయి సాధించింద‌న్న ప్ర‌చారం సాగింది. ఈ ఉత్సాహంలోనే ఇటీవ‌ల బ‌న్ని అదిరిపోయే పార్టీ ఇవ్వ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఇక అల సినిమాతో నాలుగు కాసులు వెన‌కేసుకున్న పంపిణీ దారులు ఎగ్జిబిట‌ర్ల‌ కు ప్ర‌త్యేకించి పార్టీలు ఇస్తూ వేడెక్కిస్తున్నారు.

నా పేరు సూర్య డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ త‌ర్వాత ఏడాది పాటు ఎంతో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డిన బ‌న్నీకి ఇది పెద్ద రిలీఫ్ మూవ్ మెంట్. అందుకే ఫ్యామిలీ మొక్కుల‌న్నీ తీర్చేసుకుంటున్నారు. నేడు తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశుని స‌న్నిధానానికి బ‌న్ని కుటుంబ స‌మేతంగా వెళ్లారు. వెంక‌న్న సామి మొక్కును తీర్చారు. బ‌న్ని వెంటే స్నేహారెడ్డి - అల్లు అర్హ‌- అయాన్ స‌హా చిత్ర‌బృందం ఉన్నారు. ఈ బృందంలో ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ప‌క్క‌నే న‌డుచుకుంటూ వ‌స్తున్న బ‌న్ని కుమార్తె అర్హ‌ను ఎత్తుకుని క‌నిపించారు.

ఇంత‌కుముందు శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి వెళ్లేప్పుడు బ‌న్ని ఎంతో స్టైలిష్ లుక్ తో క‌నిపించారు. ఇప్పుడిలా దైవ‌స‌న్నిధానంలో ప్ర‌త్యేకించి డ్రెస్ కోడ్ తో క‌నిపించ‌డం అభిమానుల్ని ఆక‌ట్టుకుంది. ఇక అన్ని పార్టీలు అయి పోయాయి కాబ‌ట్టి త‌దుప‌రి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం లో రెగ్యుల‌ర్ షూటింగ్ కి ఎటెండ్ కావాల్సి ఉంటుంది. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ల క‌థ‌తో రూపొందుతున్న చిత్ర‌మిది. థాయ్ ల్యాండ్ అడ‌వుల్లో సుక్కూ భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ఫియ‌ర్ ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఆ క్ర‌మంలోనే ఈ షెడ్యూల్ ని ఎలా రీడిజైన్ చేయ‌బోతున్నారు? అన్న‌ది రివీల్ కావాల్సి ఉంటుంది.