Begin typing your search above and press return to search.

దిల్ రాజు మ‌న‌వ‌రాలి బ‌ర్త్ డే వేడుక‌ల్లో బ‌న్నీ-స్నేహ‌ల మెరుపులు!

By:  Tupaki Desk   |   6 Jan 2023 5:28 AM GMT
దిల్ రాజు మ‌న‌వ‌రాలి బ‌ర్త్ డే వేడుక‌ల్లో బ‌న్నీ-స్నేహ‌ల మెరుపులు!
X
టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఇప్పుడిప్పుడే వార‌సుల్ని తెర‌పైకి తెస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న త‌ర్వాత త‌న‌త‌రం సినిమా రంగంలో ఏదో ఒక క్రాప్ట్ లో రాణించాల‌న్న‌ది ఆయ‌న క‌ల‌. అందుకే ఆయ‌న‌తో పాటు బ్ర‌ద‌ర్స్ నికూడా నిర్మాత‌ల‌గా లాంచ్ చేసి స‌క్సెస్ చేసారు. ఇప్పుడు వాళ్ల బిడ్డ‌లు..స‌హా త‌న వార‌స‌త్వాన్నిరంగంలోకి దించుతున్నారు. అశ్వినీద్ త్ కుమార్తెలు త‌ర‌హాలో దిల్ రాజు త‌న కుమార్తెని పెద్ద నిర్మాతని చేయాలని చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో దొరికిన వేదిక‌ని స‌ద్వినియోగం చేసుకుంటున్న‌ట్లు క‌నిపిస్తుంది.

తాజాగా గురువారం రాత్రి హైదరాబాద్‌లో దిల్ రాజు మనవరాలు ఇషిత పుట్టినరోజు వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు కొంత‌మంది టాలీవుడ్ ప్ర‌ముఖులు హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తోక‌లిసి విచ్చేసారు. పొడ‌వైన బ్లాక్ డార్క్ గౌనులో స్నేహ త‌ళుక్కున మెరిసారు. ఈ లుక్లో ఆమె ఎంతో అందంగా క‌నిపిస్తున్నారు.

అల్లు అర్జున్ బ్లాక్ షర్ట్ మరియు గ్రే ప్యాంట్‌లో ధ‌రించారు. ఈ వెంట్ లో బ‌న్నీ -దిల్ రాజు ముద్దుల‌ మనవడు అర్నాష్‌తో ఉల్లాసభరితమైన క్షణంలో క‌నిపిస్తున్నాడు. అర్నాష్ బుగ్గలు పట్టుకుని ముద్దాడాడు. స్నేహ కూడా పిల్లాడ‌ని చేతుల్ల‌కి తీసుకోబోయారు. ఆ ప‌క్క‌నే రాజాగారు ఈ స‌న్నివేశం చూసి పుల్లకించిపోయారు.

ఆయ‌న కూడా ఎంతో స్టైలిష్ గా త‌యార‌య్యారు. బ్లూ క‌ల‌ర్ షూట్ లో మెరిసిపోతున్నారు. ప్ర‌స్తుతం ఆ ఈ వెంట్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అభిమానులు ఆస‌న్నివేశాన్ని ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక ఫోటోలో బ‌న్నీలుక్ పై చ‌ర్చ మొద‌లైంది. పుష్ప‌-2 షూట్ మొద‌లైన త‌ర్వాత బ‌న్నీ బ‌య‌ట క‌నిపించ‌లేదు.

దీంతో నిన్న‌టి రోజున చ‌ర్చంతా బ‌న్నీ ల‌క్ గురించే. పుష్ప‌రాజ్ సినిమాలో ఎలాంటి ఆహార్యంలో క‌నిపించ‌నున్నాడు? అన్న‌ది నిన్న‌టి లుక్ కొంత క్లారిటీ ఇస్తుంది. జనవరి 7న హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో షూటింగ్ ప్రారంభించున్నారు. రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.