Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ‌తో బ‌న్ని ముచ్చ‌ట‌గా మూడోసారి

By:  Tupaki Desk   |   6 Sep 2021 12:30 PM GMT
బుట్ట‌బొమ్మ‌తో బ‌న్ని ముచ్చ‌ట‌గా మూడోసారి
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఐకాన్` తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. `పుష్ప` చిత్రం పూర్త‌యిన వెంట‌నే బ‌న్నీ ఐకాన్ చిత్రాన్నే సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు. వాస్త‌వానికి పుష్ప‌కంటే ముందుగానే ఐకాన్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లాల్సింది. కానీ సుకుమార్ వేగం పెంచ‌డం.. .బ‌న్నీ ఇంట్రెస్ట్ కార‌ణంగా పుష్ప‌ని ముందుగా లైన్ లోకి తేవాల్సి వ‌చ్చింది. కార‌ణాంత‌రాన ఆల‌స్యం త‌ప్ప‌లేదు. ఈ నేప‌థ్యంలో వేణు శ్రీరామ్ ని ఇక వెయిట్ చేయించ‌డానికి బ‌న్నీ ఎంత‌మాత్రం సిద్ధంగా లేరు. ఇటీవ‌లే `వ‌కీల్ సాబ్` చిత్రంతో మంచి స‌క్సెస్ అందుకున్న వేణు పై బ‌న్నీకి న‌మ్మ‌కం మ‌రింత బ‌ల‌ప‌డింది. ఆ కాన్ఫిడెన్స్ తో వీలైనంత‌ వేగంగా ఐకాన్ ని ప‌ట్టాలెక్కించాల‌ని భావిస్తున్నారు.

దీంతో ద‌ర్శ‌కుడు వేణు ప్రీప్రొడ‌క్ష‌న్ పూర్తి చేస్తూ న‌టీన‌టుల ఎంపికలో బిజీ అయిన‌ట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా బ‌న్నీ ఒక‌సారి క‌లిసి ప‌నిచేసిన హీరోయిన్ తో మ‌ళ్లీ సినిమా చేయ‌రు. అలా చాలా అరుదుగా మాత్ర‌మే జ‌రుగుతుంది. అలా బుట్టబొమ్మ పూజాహెగ్డే తో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు రెండు సినిమాల‌కు ప‌ని చేసారు. తొలిసారి `దువ్వాడ జ‌గ‌న్నాథం` కోసం ఈ జంట చేతులు క‌లిపింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ కార‌ణంగా `అల వైకుంఠ‌పుర‌ములో` కోసం కలిసి ప‌ని చేశారు. అయితే తాజాగా మ‌ళ్లీ వేణు శ్రీరామ్ పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకోవాల‌ని భావిస్తున్నారుట‌. నిర్మాత దిల్ రాజు కూడా పూజా ఫామ్ లో ఉంది కాబ‌ట్టి ఆ భామ‌కే ఓటు వేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

ఆమె డేట్లు గురించి క‌నుక్కోమ‌ని త‌న టీమ్ ని ఆదేశించిన‌ట్లు స‌మాచారం. అదే గ‌నుక నిజ‌మైతే బ‌న్నీ ముచ్చ‌ట‌గా మూడ‌వసారి బుట్ట‌బొమ్మ‌తో క‌లిసి న‌టించాల్సి ఉంటుంది. స‌మంత‌... కాజ‌ల్ అగ‌ర్వాల్..శ్రుతి హాస‌న్.. ర‌కుల్ ప్రీత్ సింగ్ లాంటి టాప్ స్టార్ల‌తోనే ఇప్ప‌టివ‌ర‌కూ బ‌న్నీ రెండుసార్లు సినిమాలు చేయ‌లేదు. అలాంటిది పూజాతో ఏకంగా మూడ‌వ‌సారి జ‌త క‌ట్ట‌డం నిజ‌మైతే ఇది చ‌ర్చ‌నీయాంశ‌మే అవుతుంది.