Begin typing your search above and press return to search.

అల్లు బ్రదర్స్ - త్రీ చీర్స్

By:  Tupaki Desk   |   28 Oct 2018 10:04 PM IST
అల్లు బ్రదర్స్ - త్రీ చీర్స్
X
సాధారణంగా అల్లు అరవింద్ కు ఇద్దరే అబ్బాయిలన్న అభిప్రాయం సాధారణ ప్రేక్షకుల్లో ఉంది. ఇప్పటిదాకా అల్లు అర్జున్-శిరీష్ లు మాత్రమే తెరమీద కనిపించారు కాబట్టి అలా అనుకోవడం సహజం. కానీ ఆయన పెద్ద అబ్బాయ్ వెంకటేష్ అలియాస్ బాబీ మాత్రం బయట చాలా అరుదుగా కనిపిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉండే బాబీ చాలా రోజుల తర్వాత ఇద్దరు తమ్ముళ్లతో కలిసి ఓ పబ్ లో కలిసి సరదాగా గడుపుతున్న పిక్ ని శిరీష్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసుకున్నాడు. హైదరాబాద్ సెన్సేషన్ రైజ్ లో ముగ్గురు అన్నదమ్ములు మాంచి సమయం గడిపినట్టు ఉన్నారు. గాగుల్స్ తో విభిన్నమైన పబ్ లైటింగ్ లో వెరైటీ గా అనిపిస్తున్న ఈ లుక్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ లా ఉంది. బన్నీ అన్నయ్యను చాలా రోజుల తర్వాత చూస్తున్న అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రారంభానికి ముందు లీజర్ టైంని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. డిసెంబర్ లో ప్రారంభం కాబోతోందని వార్తలు వస్తున్నాయి. శిరీష్ ఎబిసిడి పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో కానీ బన్నీ కొత్త సినిమా చూసే అవకాశం లేనట్టే. మరి అన్నయ్య బాబీ నిర్మాణంలో తమ్ముడు శిరీష్ తో కలిసి నటిస్తూ నాన్న అరవింద్ పర్యవేక్షణలో ఓ సినిమా రావాలని కోరుతున్నారు ఫ్యాన్స్. ఎప్పుడో కార్యరూపం దాల్చడం ఖాయమే అయినా టైం మాత్రం పడుతుంది.ఇటీవలే అత్తారింటికి వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ తరచుగా బయట కనిపిస్తూనే ఉన్నాడు. తమ్ముడితో ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తున్న పిక్ శిరీష్ ద్వారా చాలా రోజుల తర్వాత చూసే అవకాశం దక్కడం అంటే అభిమానులకు పండగే కదా.