Begin typing your search above and press return to search.

బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో బన్నీ..?

By:  Tupaki Desk   |   3 May 2023 1:03 PM GMT
బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో బన్నీ..?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఆయన క్రేజ్ రోజు రోజకీ పెరిగిపోతోంది. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్స్ తో బిజీగా ఉన్న ఆయన త్వరలోనే ఓ పెద్ద డైరెక్టర్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లలో ఒకరైన సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో బన్నీ పనిచేసే అవకాశం ఉందంటూ ప్రచారం ఊపందుకుంది.

సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు సాధారంగా ఉండవు. భారీ సెటప్ లు ముఖ్యంగా, పీరియాడిక్ సినిమాలు తీయడంలో ఆయన ప్రసిద్ది. కాగా, ఇప్పుడు వీరిద్దరూ టీమ్ అప్ అయినట్లు తెలుస్తోంది. ఎలాంటి సినిమాతో వీరిద్దరూ ప్రేక్షకుల ముందుకు రావాలా అనే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత టాలీవుడ్ స్థాయి బాగా పెరిగిపోయింది. దీంతో, బాలీవుడ్ డైరెక్టర్లు సైతం టాలీవుడ్ నటుల వైపు చూస్తున్నారు, ఎన్టీఆర్, చరణ్ ఆ విధంగా బాలీవుడ్; హాలీవుడ్ లో ఆఫర్లు కొట్టేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే పుష్పతో ఓవరాల్ ఇండియాలో క్రేజ్ తెచ్చుకున్న బన్నీతో సినిమా చేయాలని భన్సాలీ భావించినట్లు తెలుస్తోంది.

ఎలాంటి క్యారెక్టర్ లో అయినా పరకాయ ప్రవేశం చేయగల నటుడు అల్లు అర్జున్. అలాంటి నటుడు సంజయ్ లీలా భన్సాలీకి దొరికితే, ఆ సినిమా మరెంత రసవత్తరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బజ్ వచ్చినప్పటి నుంచి బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ కాంబినేషన్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, బన్నీ అటూ బాలీవుడ్ ని సెట్ చేసుకుంటూనే, ఇటు టాలీవుడ్ లోనూ తన మార్క్ చూపించే ప్లాన్ లో ఉన్నారు. అందుకే పుష్ప తర్వాత వరసగా త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి లాంటి వాళ్లనూ లైన్ లో వుంచుతున్నారు

ఇదిలా ఉండగా, పుష్ప ది రైజ్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2024లో మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒడిశాలోని ఓ అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది.

ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు గా వ్యవహరిస్తుండగా, రష్మిక మందన్న కథానాయిక. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు పుష్ప: ది రూల్ 2024 వేసవిలో విడుదల కానుంది.