Begin typing your search above and press return to search.

సడెన్ గా పాలకొల్లు వెళ్లిన అల్లు అర్జున్.. ఎందుకు?

By:  Tupaki Desk   |   14 Dec 2020 1:39 PM IST
సడెన్ గా పాలకొల్లు వెళ్లిన అల్లు అర్జున్.. ఎందుకు?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సడెన్ గా ఏపీలోని ఓ పట్టణానికి వెళ్లాడు. ఆయన ఎందుకు వెళ్లాడు? ఏంటి కథ అనేది టాలీవుడ్ లో ఆసక్తిగా మారింది. అయితే బన్నీ వెళ్లింది తన దగ్గరి ఫ్రెండ్ పరామర్శకని తెలిసింది.

హీరో అల్లు అర్జున్ తాజాగా పాలకొల్లుకు వెళ్లారు. విమానంలో రాజమండ్రి వెళ్లిన బన్నీ అక్కడి నుంచి బైరోడ్ లో పాలకొల్లుకు చేరుకున్నారు. అల్లు అర్జున్ కు సన్నిహితుడైన బన్నీ వాసు సోదరుడు ఇటీవల మరణించారు. కరోనా తగ్గాక ఊపిరితిత్తుల సమస్య రావడంతో ఆయన మరణించారు. దీంతో బన్నీ వాసును పరామర్శించడానికి స్వయంగా అల్లు అర్జున్ వెళ్లడం విశేషం.

అల్లు అర్జున్ కు బన్నీ వాసుకు మంచి స్నేహం ఉంది. గీతా ఆర్ట్స్, గీతా2 ఆర్ట్స్ బాధ్యతలు అన్నీ బన్నీ వాస్ చూస్తుంటారు. అల్లు అర్జున్ వ్యవహారాలను కూడా ఇదే బన్నీ వాసు పర్యవేక్షిస్తారు. సో తన సన్నిహితుడి అన్న మరణంతో అక్కడే ఉన్న బన్నీ వాసును అల్లు అర్జున్ స్వయంగా పాలకొల్లు వెళ్లి పరామర్శించడం విశేషం. సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు అల్లు అర్జున్ వచ్చేశాడు.