Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ వెంట బన్నీ హింట్ ఇచ్చేసాడుగా!

By:  Tupaki Desk   |   6 March 2022 5:30 AM GMT
ప‌వ‌న్ వెంట బన్నీ హింట్ ఇచ్చేసాడుగా!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `భీమ్లా నాయ‌క్` బ్లాక్ బ‌స్ట‌ర్ తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు వ‌సూళ్ల సునామీ సృష్టిస్తుంది. దాదాపు ఐదారేళ్ల త‌ర్వాత ప‌వ‌న్ కి ద‌క్కిన స‌క్సెస్ ఇది. దీంతో అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవ్.

ప‌వ‌న్ వెంట ఎవ‌రున్నా? లేక పోయినా అభిమానులం మేమున్నామంటూ `భీమ్లా నాయ‌క్` ని ఆద‌రించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. మూడు రోజుల్లోనే 100 కోట్ల క్ల‌బ్ లో చేరిందంటే ప‌వ‌న్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధ‌మ‌వుతుంది. అయితే ఈ సినిమా గురించి మెగా ఫ్యామిలీ హీరోలెవ‌రు స్పందించ‌లేదు.

ఆఫ్యామిలీ హీరోలు సినిమా చూసారా? లేదా? అన్న‌ది తెలియ‌దు గానీ అల్లు వారి కుటుంబం నుంచి మాతంరం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ స‌మేతంగా ఏఏంబీ మాల్ లో సినిమా చూసొచ్చారు. సినిమా రిలీజ్ అయిన మ‌రుస‌టి రోజే బ‌న్నీ ఆ ప‌ని చేసి ప‌వ‌న్ అభిమానుల మ‌న‌సు దొచారు. దీంతో బ‌న్నీ సినిమా గురించి ఏదో ఒక ట్వీట్ చేస్తార‌ని ప్రేక్ష‌కాభిమానులు ఎంతో అంతా ఆశ‌ప‌డ్డారు. బాల‌య్య `అఖండ` సినిమా చూసొచ్చి బ‌న్నీ ఓ రేంజ్ లో ట్వీట్ చేసారు. అలాగే సూప‌ర్ స్టార్ మ‌హేష్ సైతం `భీమ్లా నాయ‌క్` టీమ్ ని ట్విట‌ర్లో విష్ చేసారు.

ఈ నేప‌థ్యంలో బ‌న్నీ ` భీమ్లా నాయ‌క్` గురించి త‌న రివ్యూ క‌చ్చితంగా ఉంటుంద‌ని కొన్ని రోజుల పాటు అభిమానులు వెయిట్ చేసారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ అలాంటి సీన్ చోటు చేసుకోలేదు. ఇక జ‌ర‌గ‌ద‌ని దాదాపు ఓ అంచ‌నాకి వ‌చ్చేసారు. దీంతో మెగా- అల్లు కుటుంబాల మ‌ధ్య వైరం ఏదో ఉంద‌నే ప్ర‌చారం మ‌ళ్లీ మొద‌లైంది. ప‌వ‌న్ అభిమానుల‌కు-బ‌న్నీ అభిమానుల‌కు మొద‌ట ఇనుంచి పొస‌గ‌ని సంగ‌తి తెలిసిందే. సోషల్ మీడియా వేదిక‌గా ఒక‌ర్ని ఒక‌రు దూషించుకున్నారు.

మెగా ఫ్యామిలీ హీరోలు ఆ విష‌యంలో ఎంత స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేసినా అవి ప్ర‌య‌త్నాలుగానే మిగిలిపోతున్నాయి. ఆ క్ష‌ణం కామ్ గా ఉన్నా మ‌ళ్లీ ఏదో రూపంలో వైరం తెర‌పైకి వ‌స్తోంది. అభిమానుల మ‌ధ్య అలాంటి అస‌మాన‌త‌ల్ని తొల‌గించ‌డానికే బ‌న్నీ `భీమ్లా నాయ‌క్` షోకి వెళ్లారంటూ కొంత మంది అభిప్రాయప‌డుతున్నారు. రివ్యూ ఇవ్వ‌డం..ఇవ్వ‌క‌పోవ‌డం అన్న‌ది అత‌ని వ ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మ‌ని..అంత మాత్రాన ఏదో ఉంద‌ని భూత‌ద్దం పెట్టి చూడ‌టం స‌బ‌బు కాదనే వాద‌న వినిపిస్తోంది.

ప‌వ‌న్ ని అభిమానించ‌క‌పోతే బ‌న్నీ ఎందుకు ఫ్యామిలీతో సినిమాకి వెళ్లార‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు విశ్లేష‌కులు. మెగా ఫ్యామిలీ హీరోలు `భీమ్లా నాయ‌క్` చూడ‌క‌పోయినా అల్లు కుటుంబం నుంచి బ‌న్నీ చూసి రావ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌య‌మే క‌దా. ఆ ర‌కంగా ప‌వ‌న్ వెంట నేను ఉన్నాను అన్న బ‌ల‌మైన సంకేతాన్ని బ‌న్నీ పంపిచిన‌ట్లు అయింది.