Begin typing your search above and press return to search.

ఊర మాస్ పార్టీతో అద‌గొట్టిన బ‌న్నీ!

By:  Tupaki Desk   |   3 Aug 2016 7:25 AM GMT
ఊర మాస్ పార్టీతో అద‌గొట్టిన బ‌న్నీ!
X
అల్లు అర్జున్ న‌టించిన స‌రైనోడు 100 రోజులు పూర్తి చేసుకుంది! ఈ ఏడాది ఇంత‌వ‌ర‌కూ విడుద‌లైన చిత్రాల్లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో చిత్ర యూనిట్ అంతా మంగ‌ళ‌వారం నాడు పండుగ చేసుకుంది. అయితే, ఈ పండుగ మొత్తం బన్నీ చేశాడ‌ని చెప్పుకోవాలి. సినిమా యూనిట్ స‌భ్యులంద‌రికీ ఒక స్టైలిష్ పార్టీ ఇచ్చాడు బ‌న్నీ. ఈ పార్టీకి పెట్టిన పేరేంటో తెలుసా.. మాస్‌, ఊర మాస్ పార్టీ! పేరు త‌గ్గ‌ట్టుగానే పార్టీలో ఏర్పాట్ల‌న్నీ అద‌ర‌గొట్టేశార‌ట‌. ప‌దుల కొద్దీ వెరైటీల డ్రింక్స్‌ - ఫుడ్ వెరైటీల‌తో పార్టీ వ‌చ్చిన‌వాళ్లంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయే రేంజిలో ఏర్పాట్లు చేశార‌ని తెలుస్తోంది.

విశేషం ఏంటంటే... సెలెబ్రిటీలు ఎవ‌రైనా ఒక పార్టీ ఇస్తే మ‌హా అయితే ఓ గంట సేపు టైంపాస్ చేసి వెళ్లిపోతారు. వ‌చ్చిన గెస్టులు ఆ సెలెబ్రిటీ కోసం వెయిట్ చేస్తారు. కానీ, బ‌న్నీ మాత్రం అలా కాదు! పార్టీ ఇచ్చింది తానే కాబ‌ట్టి, అంతా తానే అన్న‌ట్టు వ‌చ్చిన అతిథులంద‌రికీ చూసుకున్నాడ‌ట‌. పార్టీ మొద‌లైన ద‌గ్గ‌ర నుంచీ వ‌స్తున్న‌వారంద‌రితో కాసేపు స్పెండ్ చేసి, స‌ర‌దా క‌బుర్లు చెప్పాడు. అడిగిన‌వారంద‌రితోనూ కాద‌న‌కుండా సెల్పీలు దిగాడు. మొత్తం పార్టీ అంతా పూర్త‌య్యేస‌రికి తెల్లారుజాము అయింది. అంత‌వ‌ర‌కూ బ‌న్నీ ఉండి, అంద‌రూ ఇంటికి వెళ్లాక‌నే బ‌న్నీ వెళ్లాడ‌ట‌.

ఈ ఊర మాస్ పార్టీని హైద‌రాబాద్‌ లో ఇటీవలే ప్రారంభించిన ఓ ప‌బ్‌ లో ఇచ్చాడు బ‌న్నీ. అయితే, ఈ ప‌బ్‌ లో బ‌న్నీకి కూడా వాటా ఉంద‌ని చెబుతున్నారు. ఏదేతైనేం - పార్టీ మాత్రం దుమ్ము దులిపేశాడ‌ని చెప్పుకుంటున్నారు. ఈ పార్టీ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను - చిత్ర యూనిట్ స‌భ్యులంద‌రూ హాజ‌ర‌య్యారు. మొత్తమ్మీద ఊర మాస్ పార్టీ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది.