Begin typing your search above and press return to search.
'గని' షూటింగ్ స్పాట్ ని సందర్శించిన అల్లు అర్జున్..!
By: Tupaki Desk | 22 July 2021 8:00 PM ISTతెలుగు సినిమా చరిత్రలో పద్మశ్రీ అల్లు రామలింగయ్య కు ప్రత్యేక స్థానం ఉంది. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తెలుగు చిత్ర సీమకు ఎనలేని సేవలందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న తనయుడు అల్లు అరవింద్ కూడా టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. తెలుగుతో పాటుగా హిందీ తమిళ్ వంటి పలు భారతీయ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అల్లు రామలింగయ్య - అల్లు అరవింద్ వేసిన బాటలోనే అల్లు ఫ్యామిలీ నుంచి మూడో తరానికి చెందిన అల్లు వెంకటేష్ (బాబీ) కూడా సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టారు.
రినైసెన్స్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన అల్లు బాబీ.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ''గని'' అనే పవర్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీని నిర్మిస్తున్నారు. బ్యాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. 'గని' టైటిల్ తో పాటు ఇతర పబ్లిసిటీ కంటెంట్ తో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో క్రేజ్ ఏర్పడింది. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లు వెంకటేశ్ సోదరుడు స్టార్ హీరో అల్లు అర్జున్ తాజాగా 'గని' షూటింగ్ స్పాట్ ని సందర్శించారు.
ఈ సందర్భంగా బన్నీ తన అన్న అల్లు బాబీతో పాటు 'గని' చిత్ర యూనిట్ అందరకీ శుభాబినందనలు తెలియజేసారు. అల్లు ఫ్యామిలీ నుంచి తన తాత తండ్రి తరువాత మూడో తరానికి చెందిన వారసుడిగా సినీ నిర్మాణంలోకి తన సోదరుడు అల్లు వెంకటేశ్ అడుగు పెట్టడం చాలా ఆనందంగా ఉందని.. సినీ నిర్మాతగా అల్లు వెంకటేశ్ దిగ్విజయంగా ముందుకు వెళ్లాలని తాను ఆ దేవుడుని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నానని అల్లు అర్జున్ అన్నారు
కాగా, 'గని' చిత్రంలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ ఉపేంద్ర - బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి - విలక్షణ నటుడు జగపతిబాబు - నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.