Begin typing your search above and press return to search.

డెఫినిషన్స్ లేవు డిస్క్రిప్షన్స్ మాత్రం ఉన్నాయి

By:  Tupaki Desk   |   5 Sep 2018 4:58 AM GMT
డెఫినిషన్స్ లేవు డిస్క్రిప్షన్స్ మాత్రం ఉన్నాయి
X
వంట వేర్చుకోవాలంటే ఏం చేయాలి? వంట వచ్చిన వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. వీణ నేర్చుకోవాలంటే?... అది కూడా సేమ్ ప్రాసెస్. నటన?.. అది కూడా సేమ్ టూ సేమ్. కానీ చాలామంది జనాలు తమకంటే పెద్ద నటులు ఉండరని మనసులో అనుకుంటూ ఉంటారు. వీళ్ళలో చాలామంది ఉద్దేశం ఏంటంటే రోజూ సవాలక్ష అబద్దాలు చెప్తాం కదా.. ఆ సమయంలో నటిస్తాం కదా ఎవరూ కనుక్కోలేదు అని. కానీ లాజిక్ ఎక్కడ మిస్ ఆవుతుంది అంటే పక్కనోడు కూడా మనల్ని నమ్మినట్టు 'నటిస్తాడు'.

ఇక ఏదైనా శిక్షణ.. సాధనతోనే వస్తుంది. నటన కూడా అందుకు అతీతం కాదు. 'బ్లడ్' లో యాక్టింగ్ ఉండదు.. తెల్ల - ఎర్ర రక్త కణాలు - ప్లాస్మా ఉంటాయి. బ్లడ్డు డైలాగులు వినేందుకు మాత్రమే సమ్మగా ఉంటాయి! ఇంట్రో ఎక్కువయింది కాబట్టి టాపిక్ లోకి వెళ్దాం. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా ముంబై లోని ప్రముఖ యాక్టింగ్ ఇన్ స్టిట్యూట్ అయిన కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్(KNKAI) లో ఔత్సాహిక నటులకు యాక్టింగ్ క్లాస్ తీసుకున్నాడు. నటనలో మెళకువలు నేర్పించాడు.. పనిలో పనిగా జోకులేసి నవ్వించాడు కూడా.

నటనలో కొన్ని మెళకువలు చెప్పిన బన్నీ దాంతో పాటు గా సెట్ లో ఉండే కొన్ని టెక్నికల్ యాస్పెక్ట్స్ గురించి తెలిసి ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుందని తెలిపాడు. తాము ఏం చేస్తున్నామో కనుక క్లారిటీ ఉంటే ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందని చెప్పాడు. ఇక "నేను యాక్టింగ్ టిప్స్ మాత్రమే చెప్పగలను కానీ ఫిలిం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఎలా ఇవ్వాలి అని మాత్రం ఆడగొద్దు" అని చెప్పాడు.. ఈ మాట చెప్పినప్పుడు నవ్వులతో క్లాస్ మొత్తం నిండిపోయింది. ఇక దేనికి పర్ ఫెక్ట్ డెఫినిషన్స్ ఉండవని డిస్క్రిప్షన్స్ మాత్రమే ఉంటాయని.. నా చేతిలో యాపిల్ ఒక లా గా ఉంటుంది నేను ఒకరకంగా వివరిస్తాను.. అదే నీ చేతిలో యాపిల్ కు నల్ల మచ్చ ఉంటే మరో రకంగా వివరిస్తావు అంటూ ఏ విషయంపైన అయినా మీ దృష్టికోణం ముఖ్యమని చెప్పాడు. లైట్స్ - ఫ్రేమ్స్ - ఫోకస్ - జూమ్ - స్లో మోషన్ షాట్స్ గురించి కొంత వివరించాడు.

అసలే ఈరోజు టీచర్స్ డే.. వీడియో తీసింది ఈరోజు కాకపోయినా.. ఇది టీచర్స్ డే కి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ లా ఉంటుందేమో.. మీరు వీడియో పై ఓ లుక్కేయండి.