Begin typing your search above and press return to search.

హంపి లో అల్లు హీరో ఫ్యామిలి

By:  Tupaki Desk   |   5 Aug 2017 9:12 AM GMT
హంపి లో అల్లు హీరో ఫ్యామిలి
X
హీరోలు కి కొంచం ఫ్రీ టైమ్ దొరికితే ఫ్రెండ్స్ తోకాని ఫ్యామిలితోకాని టూర్లు కు వెళుతూ ఉంటారు. కొంతమంది విదేశాలుకు వెళ్ళి సేద తీరితే మరి కొంతమంది బీచ్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాని మన స్టార్ లో కొంతమంది దైవ భక్తి కూడా ఉన్నవారు ఉన్నారు. మన తెలుగు హీరో స్టైలిష్ స్టార్ కూడా కొంచం దైవ చింతన ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ మధ్యనే తన ఫ్యామిలి తో ఒక పుణ్యక్షేత్రంకు కూడా వెళ్ళాడు.

అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం రిలీజ్ తరువాత షూటింగ్లుకు కొంచం విరామం ఇచ్చినట్లు ఉన్నాడు. ఇప్పటికే తన తరవాత సినిమా నా పేరు సూర్య మొదలైనా కూడా.. మనోడు ముందు తన ఫ్యామిలీతో కలిసి హంపి కి వెళ్ళాడు. అక్కడ ఉండే విరూపాక్ష గుడిని దర్శించాడు. అక్కడ ఆలయ పెద్దలు నిర్వాహకులు అల్లు అర్జున్ ఫ్యామిలి కి స్పెషల్ దర్శనం ఏర్పాటు చేసి దగ్గర ఉంది పూజలు చేపించారు అని తెలుస్తుంది. అల్లు అర్జున్ ఆ దగ్గరలో ఉన్న కమల్ మహల్ రతి రథంను మరియు విజయవిఠల టెంపుల్ ను దర్శించాడు. ఎక్కడకు వెళ్ళిన అల్లు అర్జున్ ఫాన్స్ తాకిడి ఎక్కువగానే ఉండటం చేత అతని ట్రిప్ ని కొంచం తగ్గించుకొని హోస్పేటలో ఉన్న హోటల్ కి చేరుకున్నాడట. గుడిలో కూడా అర్జున్ తో కొంతమంది ఫోటోలు దిగడానికి ప్రయత్నాలు చేశారుని చెబుతున్నారు. ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండి దగ్గరలో ఉన్న కొన్ని గొప్ప కట్టడాలును గుడులుకు వెళ్ళే ఆలోచన ఉంది ఏమో అని కూడా చెబుతున్నారు అక్కడ హంపి పోలీసులు.

హంపి దేవాలయంను మన సౌత్ ఇండియా లోనే అతి పురాతన మైన గుడిగా పేర్కొంటారు. కర్నాటకలో ఉన్న ఈ గుడి UNESCO వాళ్ళచే కూడా గుర్తింపుబడినది. ఇండియాలో హంపి దేవాలయం వరల్డ్ హెరిటేజ్ స్పాట్ లలో ఒకటిగా మంచి పేరు ఉంది.