Begin typing your search above and press return to search.
బన్ని-రౌడీ మల్టీస్టారర్.. యాత్ర దర్శకుడితో?
By: Tupaki Desk | 6 Feb 2021 8:30 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- రౌడీ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళ్లనుందా? అంటే అవుననే ఫ్యాన్స్ లో చర్చ సాగుతోంది. రౌడీతో అల్లు అర్జున్ సత్సంబంధాల నేపథ్యంలో అలాంటి ఓ భారీ మల్టీస్టారర్ కి ఆస్కారం లేకపోలేదన్న చర్చా ఇటీవల సాగుతోంది.
బన్నీ అండ్ ఫ్రెండ్స్ కి చెందిన జీఏ2 బ్యానర్ లో రౌడీ దేవరకొండ రెండు సినిమాలు చేశారు. గీత గోవిందం.. ట్యాక్సీవాలా లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. ఆ క్రమంలోనే బన్ని-రౌడీ బంధం మరింత బలపడింది. ఇక రౌడీ బ్రాండ్ దుస్తుల్ని పలుమార్లు దేవరకొండ బన్నీకి కానుకగా పంపారు. దానికి బన్ని ఎంతో ఫిదా అయిపోయారు. ఇటీవల ఆ ఇద్దరూ చాలా సన్నిహిత సంబంధాల్ని కొనసాగిస్తున్నారు. నిరంతరం ఎప్పటికప్పుడు ఒకరి పనిని ఒకరు ప్రశంసిస్తూ ఉంటారు. తెరవెనక స్నేహితులుగా ఉన్న ఆ ఇద్దరు సౌత్ స్టార్స్ ఏదో ఒక రోజు కలిసి మల్టీస్టారర్ చేయడం ఖాయమని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
తాజా సన్నివేశం ప్రకారం.. ఈ కల నెరవేరడానికి అభిమానులు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదన్న గుసగుసా వినిపిస్తోంది. ఓ ఇన్ సైడ్ సోర్స్ అందించిన సమాచారం మేరకు.. యాత్ర ఫేం మహి వి రాఘవ్ తెరకెక్కించనున్న తదుపరి చిత్రంలో బన్ని-రౌడీ కాంబినేషన్ సెట్టవుతుందని లీకులు అందాయి. ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఇన్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ ను రూపొందించాలని మహి.వి భావిస్తున్నారట. బన్ని- విజయ్ లను కలిసి అతడు మల్టీస్టారర్లో నటించమని అడిగారట. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రకటనకు ముందే తారాగణాన్ని ఖరారు చేయడానికి దర్శకుడు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
బన్ని ప్రస్తుతం పుష్ప లాంటి పాన్ ఇండియా చిత్రంలో నటిస్తుండగా.. మరోవైపు విజయ్ తన బాలీవుడ్ అరంగేట్ర మూవీపై ఎంతో పట్టుదలగా ఉన్నాడు. పూరి దర్శకత్వంలో లైగర్ ని పాన్ ఇండియా కేటగిరీలోనే తెరకెక్కిస్తున్నారు కాబట్టి రౌడీ కూడా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగే వీలుంది. ఇలాంటి సమయంలో ఆ ఇద్దరూ కలిసి నటిస్తే డబుల్ పాన్ ఇండియా అవుతుంది! అన్న చర్చా ఇరువురి అభిమానుల్లో మొదలైంది. మరి దీనికి సంబంధించి మహి.వి.రాఘవ్ నుంచే అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది.