Begin typing your search above and press return to search.

బన్నీ అమెరికా టూర్ ఆగిపోయినట్లే

By:  Tupaki Desk   |   27 July 2017 5:02 PM
బన్నీ అమెరికా టూర్ ఆగిపోయినట్లే
X
సినిమాల విషయం అంటే అంతే. అసలు సినిమా మొదలయ్యే వరకు.. ఈ సినిమాలో హీరో అతనేనా.. ప్రొడ్యూసర్లు వాళ్లేనా.. హీరోయిన్ ఆమేనా.. మ్యూజిక్ డైరక్టర్ పలానా వ్యక్తేనా అని చెప్పలేం. ఎందుకుంటే ఇక్కడ రాత్రికి రాత్రి ప్లాన్స్ అన్నీ మారిపోతుంటాయి. అసలు సినిమా పూర్తయ్యే వరకు కూడా ఎవరు శాశ్వతం అనేది తెలియదు. కేవలం హీరో మాత్రం పర్మినెంటుగా ఉంటాడు. ఇతర ప్లాన్స్ అన్నీ మారుతుంటాయి. ఇదిగో ఇప్పుడు స్టయిలిష్‌ స్టార్ విషయంలో అదే జరిగింది.

చాలా రోజుల నుండి ముంబాయ్ లో ఉంటూ మ్యూజిక్ సిట్టింగ్స్ పనిలో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఆ తరువాత అటునుండి అటే అమెరికా వెళ్లిపోయి ఫిజికల్ ట్రైనింగ్ ఏదో తీసుకుందాం అని ప్లాన్ చేసుకున్నాడు. ఏకంగా 30 రోజులపాటు అమెరికాలో ఉంటూ తన బాడీని ఒక ప్రత్యేక విధంగా మలుచుకోవాలనేది ప్లాన్. ఇదే సందర్బంగా ఎన్నారైలను కూడా కలుద్దాం అనకున్నాడు. ఇదంతా ఓకె కాని.. ఇప్పుడు అల్లు అరవింద్ సీన్లోకి వచ్చాక ప్లాన్స్ అన్నీ మారిపోయాయ్. అసలు ఇక్కడ నుండి బలగం అంతా అమెరికా వెళ్ళి బోలెడంత డబ్బులు తగలేసే బదులు.. ఆ ట్రైనర్ నే ఇక్కడికి పిలిస్తే పనువతుందని చెప్పి.. ఇప్పుడు బన్నీ అమెరికా టూర్ ను క్యాన్సిల్ చేసేశారట. పైగా ఆగస్టు 12 నుండి కొత్త సినిమా షూటింగ్ కూడా మొదలెట్టడానికి అరవింద్ దగ్గరుండి మరి నిర్మాతలతో కసరత్తులు చేయిస్తున్నారట.

లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న 'నా పేరు సూర్య' సినిమాతో రైటర్ వక్కంతం వంశీ దర్శకుడిగా మారబోతున్నాడు. ఈ సినిమాలో అను ఎమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ ను కూడా ఎంపిక చేస్తారట. అది సంగతి.