Begin typing your search above and press return to search.

మళ్ళీ గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్న బన్నీ..!

By:  Tupaki Desk   |   10 Dec 2020 2:00 PM IST
మళ్ళీ గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్న బన్నీ..!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ - దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ''పుష్ప''. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి దట్టమైన అభయారణ్యంలో ఈ మూవీ షూటింగ్ చేశారు. అయితే కోవిడ్ ప్రభావం వల్ల 'పుష్ప' షూటింగ్ కి మళ్ళీ బ్రేక్స్ పడ్డాయని తెలుస్తోంది. ప్రస్తుతం నిహారిక పెళ్లి కోసం రాజస్థాన్ లో ఉన్న బన్నీ.. వీలైనంత త్వరగా ఈ చిత్రీకరణ రీ స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడట. ఇప్పటికే అనేక కారణాలతో లేట్ అవుతూ వచ్చిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. నిహారిక రిసెప్షన్ అయిన వెంటనే బన్నీ 'పుష్ప' షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో జరగనుంది. ఇందులో బన్నీ 'పుష్ప రాజ్' అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన 'పుష్ప' ఫస్ట్ లుక్ తో అల్లు అర్జున్ గెటప్ పై క్లారిటీ వచ్చింది. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. 'రంగస్థలం' సినిమా తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడం.. 'అల వైకుంఠపురంలో' తర్వాత బన్నీ చేస్తున్న మూవీ కావడంతో 'పుష్ప' పై భారీ అంచనాలే ఉన్నాయి.