Begin typing your search above and press return to search.

బ‌న్ని చెయ్యేస్తే ప‌నైపోయిన‌ట్టే

By:  Tupaki Desk   |   21 Nov 2015 10:47 AM IST
బ‌న్ని చెయ్యేస్తే ప‌నైపోయిన‌ట్టే
X
టాలీవుడ్ రేసుగుర్రం అల్లు అర్జున్ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ యాక్ష‌న్‌ ఎంట‌ర్‌ టైన‌ర్‌ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ 2016 ఫిబ్ర‌వ‌రిలో రిలీజ‌వుతుంద‌ని క్లోజ్ సోర్సెస్ చెబుతున్నాయి. అయితే బ‌న్ని సినిమా మాటేమో గానీ, ఈయ‌న చెయ్యేసిన ప్ర‌తి సినిమా బ్లాక్‌ బ‌స్ట‌ర్‌ హిట్టు కొట్టేస్తూ నిర్మాత‌ల‌కు లాభాల్ని ఆర్జించి పెట్ట‌డం ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

గోన‌గ‌న్నారెడ్డి క్యారెక్ట‌ర్‌ లో బ‌న్ని న‌టించ‌డం వ‌ల్ల రుద్ర‌మ‌దేవి 3డి సేఫ్ అయిపోయింది. ఆ సినిమాని ప‌ర్స‌న‌ల్‌ గా తీసుకుని బ‌న్ని ప్ర‌మోట్ చేశాడు. గుణ‌శేఖ‌ర్ నిర్మాత‌గా చాలా వ‌ర‌కూ సేఫ్ అవ్వ‌గ‌లిగాడు. అలాగే అప్ప‌ట్లో అత‌డు నాని హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ ఆడియోకి వెళ్లాడు. సెంటిమెంటుగా ఆ ఆడియో బ్లాక్ బస్ట‌ర్ హిట్‌. సినిమా కూడా అంతే పెద్ద హిట్ట‌య్యింది. ఇప్పుడు త‌న‌కి అత్యంత ఆప్తుడు - స్నేహితుడు అయిన సుకుమార్ స్వ‌యంగా ప్రొడక్ష‌న్ హౌస్ ప్రారంభించి సినిమా నిర్మిస్తే ఆ సినిమాకి బన్ని అన్నీ తానే అయ్యాడు. ఆడియో వేడుక‌కు విచ్చేసి సుకుమార్ ని బ్లెస్ చేశాడు. మ‌రోసారి సెంటిమెంటుగా కుమారి 21 ఎఫ్ మూవీ కూడా పెద్ద హిట్ట‌య్యింద‌న్న టాక్ వ‌చ్చింది.

ఇక భ‌లే భ‌లే మ‌గాడివోయ్ ఫుల్ ర‌న్ లో దాదాపు 26 కోట్లు వ‌సూలు చేసింద‌న్న టాక్ వ‌చ్చింది. ఇప్పుడు కుమారి 21 ఎఫ్ కూడా ఆ స్థాయిలో వసూలు చేస్తుందేమో మరి. ఇదంతా బ‌న్ని అనే మంచి మ‌న‌సున్న హీరో వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. మంచిదే బ‌న్ని చెయ్యేస్తే ప‌నైపోయిన‌ట్టే.. అంటే ఇక ప్ర‌తి సినిమాకి చెయ్యేయాల్సిందేనేమో!