Begin typing your search above and press return to search.

బన్నీ బేకరీ బిజినెస్ షురూ చేశాడు

By:  Tupaki Desk   |   14 Oct 2017 5:20 PM GMT
బన్నీ బేకరీ బిజినెస్ షురూ చేశాడు
X
ప్రస్తుత రోజుల్లో సినిమా కెరీర్ లో కొనసాగుతున్న చాలామంది స్టార్స్ ఇతర బిజినెస్ లలో కొనసాగుతున్నారు. ఈ స్టార్ హోదా ఎన్నేళ్లు ఉంటుందో ఎవరు కరెక్ట్ గా చెప్పేలేరు. దీంతో వారికంటూ ఒక బ్యాక్ సపోర్ట్ కిందా బిజినెస్ లో కొంత డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే నాగార్జున మంచి హీరోగానే కాకుండా మంచి బిజినెస్ మెన్ అనిపించుకునేలా కొన్ని బిజినెస్ లను స్టార్ట్ చేసి ప్రాఫిట్స్ ను అందుకుంటున్నారు.

అలాగే రామ్ చరణ్ కూడా డొమెస్టిక్ లెవెల్ లో విమానాలనే నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ కూడా త్వరలోనే కొన్ని బిజినెస్ లను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక వారి స్టైల్ లోనే స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మరో బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అందరిలా కాకుండా ఈ సరైనోడు ఇంటర్ నేషనల్ రుచులను చూపించే ఒక బేకరీని స్టార్ట్ చేయబోతున్నాడు. కెనోలి కేఫ్ అని జూబ్లీహిల్స్ లో స్థాపించనున్నాడని తెలుస్తోంది. అయితే బన్నీ ఇంతకుముందే అక్కడే 800 అనే క్లబ్ ని స్థాపించాడు.

ఇప్పుడు మళ్లీ మరో వ్యాపారాన్ని స్థాపించి ఎంతో కొంత లాభాన్ని పొందాలని చూస్తున్నాడు. అందులో అమెరికాలో స్పెషల్ గా ఉండే కొన్ని ఐటమ్స్.. అలాగే ఫ్రెంచ్ పేస్ర్టీలు.. ఇటాలియన్ బిస్కెట్లు.. అన్నీ అక్కడుంటాయట. ఇకపోతే బన్నీ ఇదే తరహాలో కొన్ని స్పోర్ట్స్ కి సంబందించిన వాటిల్లో కూడా షేర్స్ సంపాదించాడు. ప్రో కబడ్డీ లీగ్స్ లో చెన్నై తలైవాస్ కేరళ ఫుట్ బాల్ క్లబ్స్ వంటి వాటిలో కూడా బన్నీ భాగస్వామిగా ఉన్నాడు.