Begin typing your search above and press return to search.

చ‌బ్బీ బోయ్ అన్నందుకు బ‌న్నిలో రియ‌లైజేష‌న్

By:  Tupaki Desk   |   28 Aug 2020 4:30 PM GMT
చ‌బ్బీ బోయ్ అన్నందుకు బ‌న్నిలో రియ‌లైజేష‌న్
X
కాస్త బొద్దెక్కినా చ‌బ్బీ బోయ్ బొద్ద‌బ్బాయ్ అంటూ ఆట‌ప‌ట్టిస్తారు. పైగా తెలుగు ఆడియెన్ మామూలోళ్లు కాదు. కొంటె కామెంట్లతో మ‌తి చెడ‌గొడ‌తారు. మ‌రి త‌న‌పై ఏ కామెంట్ ఎక్క‌డ విన్నాడో కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ విష‌యాన్ని చాలా సీరియ‌స్ గానే తీసుకున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.

అందుకే ఇటీవ‌ల అలుప‌న్న‌దే లేకుండా శ్ర‌మిస్తున్నాడు. జాగింగ్ లు చేస్తూ జిమ్ లో శ్ర‌మిస్తూ బాగా బరువు తగ్గించుకున్నాడు. ఇటీవ‌ల యంగ్ బోయ్ లా మారిపోయాడు. అల వైకుంఠ‌పురములో చిత్రంలో బ‌న్ని కాస్త చ‌బ్బీగా ఉన్నాడ‌న్న కామెంటుకే అత‌డు ఇంత‌గా మారిపోయాడా? అంటే అవున‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌ల కేబీఆర్ పార్క్ ప‌రిస‌రాల్లోనే ఎక్కువ‌గా క‌నిపించాడు. భార్య స్నేహారెడ్డితో క‌లిసి అవుట్ డోర్ జాగింగ్ కు సంబంధించిన ఫోటోల‌తో అతని ఇన్‌స్టాగ్రామ్ నిండి ఉంది. వీటిలో బన్నీ ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. త‌దుప‌రి చిత్రం `పుష్ప‌`లో కొత్త లుక్ తో ఫ్రెష్ లైఫ్ ను ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నాడు.

ఇందులో బన్నీ రెండు గెట‌ప్పుల్లో క‌నిపిస్తాడు. ఒక గెట‌ప్ లో బాడీ పెంచి క‌నిపిస్తాడు. తెర‌పై చొక్కా విప్పి 6 ప్యాక్ చూపించి చాలా కాల‌మే అయ్యింది కాబ‌ట్టి పుష్ప లో అందుకు స్కోప్ ఉంటుందేమో చూడాలి. టాలీవుడ్ ‌లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ ను ప్రారంభించింది బ‌న్నీనే. దేశముదురు తో మొద‌లైన ఆ ట్రెండ్ ను హీరోలంతా అనుస‌రించారు. ఇప్పుడు మరోసారి పుష్పతో మ‌రో కొత్త అవతారాన్ని ప‌రిచ‌యం చేస్తాడా? అన్న‌ది చూడాలి. ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన కొత్త లుక్ చూస్తే అంద‌రికీ అదో స‌ర్ ప్రైజ్ గా క‌నిపించింది.