Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ త్రివిక్రమ్.. బొమ్మ అదిరిపోతుందంతే..!

By:  Tupaki Desk   |   26 May 2023 1:06 PM GMT
అల్లు అర్జున్ త్రివిక్రమ్.. బొమ్మ అదిరిపోతుందంతే..!
X
పుష్ప పార్ట్ 1 తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ని అదే రేంజ్ లో వచ్చేలా కష్టపడుతున్నాడు. సుకుమార్ అండ్ టీం కూడా పుష్ప 2ని మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హిట్ సినిమాగా నిలబెట్టాలని కృషి చేస్తున్నారు. సుకుమార్ చెప్పినట్టుగా అసలు కథ పార్ట్ 2లోనే ఉంటుందని తెలుస్తుండగా ఈ సీక్వెల్ మీద ఇప్పటికే ఆడియన్స్ ని ట్యూన్ చేసి ఉంచాడు సుక్కు. ఎంతైనా లెక్కల మాస్టర్ కదా ఆయన లెక్క పర్ఫెక్ట్ గా ఉందని పుష్ప 2 ఫస్ట్ టీజర్ చూస్తేనే అర్ధమయ్యింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తుంది. పుష్ప 2 తర్వాత అఫీషియల్ గా సందీప్ వంగా తో సినిమా ఫిక్స్ చేసుకున్న అల్లు అర్జున్ ఆ సినిమా కన్నా ముందు త్రివిక్రం తో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

సుకుమార్ తో పుష్ప 2 పూర్తి చేసిన వెంటనే త్రివిక్రం సినిమా సెట్స్ మీద కు వెళ్లేలా బన్నీ ప్లాన్ చేస్తున్నారట. త్రివిక్రం అల్లు అర్జున్ ఈ ఇద్దరి కాంబినేషన్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. జులాయి తో మొదలైన వీరి కాంబో ఆ సినిమా హిట్ అందుకోగా ఆ తర్వాత వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కూడా ప్రేక్షకుల మనసులు గెలిచింది.

ఇక హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన అల వైకుంఠపురము లో అయితే నాన్ బాహుబలి రికార్డులన్ని కూడా తిరగరాసింది. హ్యాట్రిక్ హిట్ల తర్వాత మరోసారి త్రివిక్రం, అల్లు అర్జున్ కలిసి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయేలా ఉంటుందని టాక్. ఆల్రెడీ పుష్ప తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇక మీదట తన సినిమాలన్నీ కూడా నేషనల్ వైడ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే త్రివిక్రం అల్లు అర్జున్ హిట్ కాంబో కాబట్టి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా మరింత స్పెషల్ గా ఉండేలా చూస్తున్నారట.

ప్రస్తుతం మహేష్ తో సినిమా చేస్తున్న త్రివిక్రం అల్లు అర్జున్ తో చేసే సినిమా కథ రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ మూడు వరుస హిట్లు కొట్టిన కాంబినేషన్ కాబట్టి ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమాపై ఆడియన్స్ లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో వీరి బొమ్మ అదరగొట్టేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమాకు సంబంధించిన మిగతా డీటైల్స్ త్వరలో రానున్నాయి.