Begin typing your search above and press return to search.
బన్నీ కోసం.. అలా ప్లాన్ చేసిన త్రివిక్రమ్!
By: Tupaki Desk | 2 July 2023 9:42 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మొదటి చిత్రం ఇచ్చిన సక్సెస్ కారణంగా పుష్ప 2కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ ని దేశ వ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ వచ్చింది.
సినిమా ఆడియో రైట్స్ కూడా భారీ ధర చెల్లించి టి-సిరీస్ సొంతం చేసుకుంది. డిజిటల్ రైట్స్ కోసం కూడా గట్టి పోటీ ఉంది. 150 కోట్ల వరకు డిజిటల్ హక్కుల కోసం చెల్లించేందుకు ప్రముఖ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని టాక్. ఇదిలా ఉంటే పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీచేయనున్నారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండనుంది.
ఇప్పటి వరకు త్రివిక్రమ్ టచ్ చేయని జోనర్ లో అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా ఉంటుందంట. మాటల మాంత్రికుడు అంటే మెజారిటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కనిపిస్తాయి. అయితే బన్నీ కోసం పీరియాడిక్ జోనర్ లోకి వెళ్లి ఫిక్షనల్ స్టొరీని చెప్పబోతున్నారంట. ఇక భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తారంట.
ఇప్పటికే ఈ కథపై త్రివిక్రమ్ వర్క్ స్టార్ట్ చేసేసి మెజారిటీ సిద్ధం చేసారని తెలుస్తోంది. బన్నీ కూడా చాలా సార్లు త్రివిక్రమ్ తో కూర్చొని స్టొరీ డిస్కసన్ లో పాల్గోన్నారంట. బన్నీకి కథ భాగా నచ్చిందని సమాచారం. కచ్చితంగా ఈ చిత్రంతో మాటల మాంత్రికుడు డైలాగ్స్ దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తాయని వినికిడి. ఆగష్టులో ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందంట.
ఇప్పటికే టాలీవుడ్ నుంచి రాజమౌళిని అనుసరిస్తూ సుకుమార్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఇప్పుడు దేవరతో కొరటాల శివ తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. యువ దర్శకులలో చందూ మొండేటికి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసింది. ఇక త్రివిక్రమ్ కూడా అదే లైన్ లో పాన్ ఇండియా బ్రాండ్ తెచ్చుకునే పనిలో ఉన్నారు. దీనికోసం బన్నీ సినిమాని ఎంచుకున్నారు.