Begin typing your search above and press return to search.

ఈ లైన‌ప్ లో ద‌ర్శ‌క‌ధీరుడికి చోటేది?

By:  Tupaki Desk   |   31 July 2020 8:10 AM GMT
ఈ లైన‌ప్ లో ద‌ర్శ‌క‌ధీరుడికి చోటేది?
X
స్టార్ డ‌మ్ ని ఒక్కో మెట్టు పైకి ఎక్కించాలంటే ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ ఉన్న‌ ద‌ర్శ‌కుల్ని వెత‌కాల్సి ఉంటుంది. ఆ కోవ‌లో చూస్తే `నా పేరు సూర్య‌` లాంటి డిజాస్ట‌ర్ లో న‌టించాక బ‌న్ని ప‌రిణ‌తిని మెచ్చుకుని తీరాల్సిందే. త‌న‌కు రెండు బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇచ్చిన త్రివిక్ర‌మ్ తో సినిమా చేశాడు. `అల వైకుంఠ‌పుర‌ములో` ఇండ‌స్ట్రీ నాన్ బాహుబ‌లి రికార్డుల్ని బ్రేక్ చేసి బ‌న్నీని ఒక్క‌సారిగా స్కైలోకి లేపింది. వెంట‌నే రంగ‌స్థ‌లం లాంటి మ‌రో ఇండ‌స్ట్రీ హిట్ చిత్రాన్ని ఇచ్చిన సుకుమార్ కి అవ‌కాశం ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ జోడీ నుంచి పుష్ప రానుంది.

సుకుమార్ త‌ర్వాత అప‌జ‌య‌మెరుగ‌ని కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్నాడు. ఈలోగానే త్రివిక్ర‌మ్ లైన్ లోకి రానున్నాడు. ఈ మ‌ధ్య‌లోనే యాత్ర ఫేం మ‌హి.వి.రాఘ‌వ్ తోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇదంతా ఓకే కానీ.. ఈ లైన‌ప్ లో త్రివిక్ర‌మ్- సుకుమార్-కొర‌టాల శివ క‌నిపిస్తున్నారు. కానీ రాజ‌మౌళి మిస్స‌య్యారు ఎందుక‌నో. ఇప్పుడు ఫామ్ లో ఉన్న అగ్ర ద‌ర్శ‌కులంతా ఒకెత్తు అనుకుంటే.. రాజ‌మౌళి ఒక్క‌డే ఒకెత్తు. అందుకే జ‌క్క‌న్న‌తో బ‌న్ని సినిమా చేస్తే బావుంటుంద‌నేది అభిమానుల మాట‌.

కానీ దానికి ఇప్పుడు ఛాన్స్ దొర‌క‌డం క‌ష్ట‌మేన‌నేది ఓ విశ్లేష‌ణ‌. రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ తెర‌కెక్కిస్తున్నారు. చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ ల‌కు బిగ్ బ్రేకింగ్ మూవీ ఇద‌ని భావిస్తున్నారు. ఆ త‌ర్వాత మ‌హేష్ తో సినిమాకి క‌మిట‌య్యారు జ‌క్క‌న్న‌. అంటే అప్ప‌టివ‌ర‌కూ బ‌న్నితో మూవీకి ఆస్కారం లేనట్టే.

ఇప్ప‌టికి లైన‌ప్ బావుంది. కానీ ఇక్క‌డితో ఆగితే స‌రిపోతుందా? బ‌న్ని-త్రివిక్ర‌మ్.. బన్ని - సుకుమార్ అంటే మార్కెట్లో విప‌రీత‌మైన క్రేజు ఉంది. అలాగే కొర‌టాల‌కు ఉన్న క్రేజు దృష్ట్యా ఆ మూవీపైనా భారీ అంచ‌నాలేర్ప‌డ‌తాయి. అయితే వీట‌న్నిటినీ మించి బ‌న్ని పాన్ ఇండియా రేంజుకు చేరాలంటే రాజ‌మౌళితోనే ప‌న‌వుతుంది. మ‌రి అది ఎప్ప‌టికి సాధ్య‌మ‌వుతుందో చూడాలి. వ‌రుస‌గా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేస్తున్నా టాప్ వ‌న్ స్థానాన్ని కాపాడుకునేందుకు బ‌న్ని నిరంత‌రం ప్లానింగ్ మార్చాల్సి ఉంటుంది. కొర‌టాల త‌ర్వాత తిరిగి త్రివిక్ర‌మ్ తో చేస్తాడా? జక్క‌న్న‌ను క్యాచ్ చేస్తాడా? అన్న‌దే అస‌లు పాయింట్.