Begin typing your search above and press return to search.
నిజంగా ఆ దర్శకుడికి బన్నీ ఓకే చెప్పాడా?
By: Tupaki Desk | 16 April 2020 6:00 PM ISTఅర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డిని రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. ఈయన తదుపరి చిత్రం బాలీవుడ్ లో ఉంటుందని అంతా అనుకున్నారు. ఒక యంగ్ స్టార్ హీరోకు కథ వినిపించాడని త్వరలోనే ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈయనకు అడ్వాన్స్ ఇచ్చిందని కూడా వార్తలు వచ్చాయి. కాని అవన్ని పుకార్లే అని తేలిపోయింది. ఆ మద్య ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి తన తదుపరి చిత్రం సౌత్ లోనే ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత ఈయన మహేష్ బాబు తో.. విజయ్ దేవరకొండ తో సినిమా చేయబోతున్నాడు అంటూ పుకార్లు పుట్టుకు వచ్చాయి. ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు సందీప్ రెడ్డి రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సందీప్ రెడ్డికి బన్నీ నుండి గ్రీన్ సిగ్నల్ లభించిందంటూ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేకపోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ చిత్రంను చేస్తున్నాడు. ఆ తర్వాత మరో రెండు సినిమాలకు కూడా ఇప్పటికే కమిట్ అయ్యాడు. ఒక వేళ అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డి సినిమా చేయాలంటే కనీసం రెండేళ్లయినా వెయిట్ చేయాల్సి ఉంటుందని.. మరి అప్పటి వరకు ఆయన వెయిట్ చేస్తాడా అనేది అనుమానమే కనుక బన్నీతో సందీప్ రెడ్డి మూవీ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని మెగా వర్గాల వారు అంటున్నారు. అసలు విషయం ఏంటీ అనేది సందీప్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలంటూ నెటిజన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.