Begin typing your search above and press return to search.

ఆయ‌న సీమ వాలా.. ఈయ‌న చిత్తూరు వాలా!

By:  Tupaki Desk   |   26 Feb 2020 4:30 PM GMT
ఆయ‌న సీమ వాలా.. ఈయ‌న చిత్తూరు వాలా!
X
ప్రాంతాన్ని బ‌ట్టి సంస్కృతి మారుతుంది. `భాష - యాస‌- వేషం` ప్ర‌తిదీ మారిపోతాయి. కొన్ని విష‌యాల్లో సారూప్య‌త‌లు క‌నిపించినా వేరియేష‌న్ అనేది స్ప‌ష్టంగా తెలుస్తుంటుంది. ఒక ప్రాంతంలోని వ్య‌వ‌హారికం.. నుడికారం మ‌రో ప్రాంతంలో ఉండాల‌ని అనుకుంటే పొర‌పాటే. ప్ర‌తి ప్రాంతానికి ఉనికికి సంబంధించిన సింప్టమ్స్ ఉంటాయి. వాటిని మ‌న ద‌ర్శ‌కులు క్యాచ్ చేయాల్సి ఉంటుంది.

ఎంచుకున్న క‌థాంశం అందులో చూపించాల్సిన సంస్కృతి.. భాష వేషం ఏమిట‌న్న‌ది ద‌ర్శ‌కుడికి స్ప‌ష్ట‌త ఉంటుంది కాబట్టి ఆ మేర‌కు ప్రిప‌రేష‌న్ సాగించాల్సి ఉంటుంది. ఇక తెలుగు సినిమాలో భాష - యాస‌- క‌ల్చ‌ర్ కి ఇటీవ‌ల ప్రాధాన్య‌త పెరిగింది. పూరి- త్రివిక్ర‌మ్- రాజ‌మౌళి- సుకుమార్ లాంటి టాప్ రేంజ్ ద‌ర్శ‌కులు వీటితో ప్ర‌యోగాలు చేసి స‌ఫ‌ల‌మ‌వుతున్నారు.

ఇంత‌కుముందు `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌`లో తార‌క్ సీమ యాస‌లో అద‌ర‌గొట్టారు. అయితే సీమ యాస భాష‌తో పాటు కల్చ‌ర్ పైనా యంగ్ య‌మ అవ‌గాహ‌న పెంచుకోవ‌డం వ‌ల్ల‌నే అంత ప‌ర్ఫెక్ష‌న్ సాధ్య‌మైంది. ఎన్టీఆర్ సీమ యువ‌కుడిగా ఛాలెంజింగ్ గా న‌టించి మెప్పించాడు. సీమకు చెందిన పాట‌ల ర‌చ‌యిత పెంచల్ దాస్ పర్యవేక్షణలో తార‌క్ శిక్షణ తీసుకున్నారు. తార‌క్ - త్రివిక్ర‌మ్ ఫార్ములా బాగానే వ‌ర్క‌వుటైంది.

ప్ర‌స్తుతం సుక్కూ తెర‌కెక్కిస్తున్న ఏఏ 20 కోసం అలాంటి విధానాన్నే అనుస‌రిస్తున్నార‌ని స‌మాచారం. బ‌న్ని కోసం ప్ర‌త్యేకించి ఒక శిక్ష‌కుడిని నియ‌మించారు. చిత్తూరు - తిరుప‌తి యాక్సెంట్ వ‌ర్క‌వుట్ అయ్యేలా బ‌న్ని ప్రాక్టీస్ చేస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే త‌న పాత్ర కోసం బ‌న్ని రూపం మార్చేశారు. ఎర్ర చంద‌నం దుంగ‌లు త‌ర‌లించే లారీ డ్రైవ‌ర్ గా చిత్తూరు వాలాగా అత‌డి ఆహార్యం ఎలా ఉండ‌బోతోందో చూడాల‌న్న ఆస‌క్తి పెరిగింది. ఇక ఈ చిత్రంలో చిత్తూరు స్థానికుల‌కే న‌టించే అవ‌కాశం ల‌భించింది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో థ్రిల్ల‌ర్ క‌థాంశానికి త‌గ్గ‌ట్టు లోక‌ల్ ప్ర‌జ‌ల్ని భాగం చేశారు సుక్కూ. ఇది ఇంట్రెస్టింగ్ టాస్క్ అనే చెప్పాలి.