Begin typing your search above and press return to search.
జయదేవ్ ఫంక్షన్ కు బన్నీ
By: Tupaki Desk | 27 Jun 2017 7:44 AM GMTమంత్రి ఘంటా శ్రీనివాసరావు శ్రీనివాసరావు కుమారుడు రవి హీరోగా రూపొందిన చిత్రం జయదేవ్. ఇప్పటికే ఇండస్ట్రీలో ఈ మూవీ గురించి కొంత బజ్ నెలకొంది. గతంలో టాప్ స్టార్స్ అందరితోను దర్శకత్వం వహించిన జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో రూపొందడంతో.. జయదేవ్ పై అంచనాలు పర్లేదనిపించే స్థాయిలోనే ఉన్నాయి.
దీంతో పాటు ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి రావడం.. తన ఆశీర్వాదాలు అందించడంతో.. ఈ సినిమాపై మెగాభిమానుల కన్ను కూడా పడింది. అటు ఘంటా శ్రీనివాసరావుకు.. ఇటు దర్శకుడు జయంత్ సి పరాన్జీకి.. మరోవైపు సంగీత దర్శకుడు మణిశర్మకు.. మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే.. ఇప్పుడీ జయదేవ్ కు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయనుండగా.. దానికి మరో మెగా హీరోను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు.
తాజాగా దువ్వాడ జగన్నాధం అంటూ బాక్సాఫీస్ ను దున్నేస్తున్న అల్లు అర్జున్ ను.. జయదేవ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరు కానున్నాడు. వైజాగ్ లోని నోవోటెల్ హోటల్ లో జరగనున్న ఈ వేడుకకు.. బన్నీరాక ఇప్పటికే ఖాయమైంది. జూన్ 30న ఘంటా రవి హీరోగా నటించిన జయదేవ్ విడుదల కానుండగా.. ఈ సినిమా వర్గాలు మెగాభిమానుల మెప్పు సంపాదించేందుకు గట్టిగానే కష్టపడుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/