Begin typing your search above and press return to search.

బ‌న్నీ కొత్త సినిమాకు టీం సెట్ అయ్యింది

By:  Tupaki Desk   |   18 Jun 2016 1:10 PM GMT
బ‌న్నీ కొత్త సినిమాకు టీం సెట్ అయ్యింది
X
స‌రైనోడు లాంటి ఊర‌మాస్ మూవీతో హిట్‌కొట్టిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అప్పుడే త‌న నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నాడు. స‌రైనోడు సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.74 కోట్ల షేర్‌ తో పాటు శాటిలైట్ రైట్స్‌ తో క‌లుపుకుని రూ.90 కోట్ల వ‌ర‌కు రాబ‌ట్టింది. దీంతో అల్లు అర్జున్ మార్కెట్ ఒక్క‌సారిగా పెరిగిపోవ‌డంతో పాటు టాలీవుడ్ టాప్ హీరోల జాబితాలో బ‌న్నీ త‌న ప్లేస్ మ‌రింత స్ర్టాంగ్ చేసుకున్నాడు. ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ కోలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

డిఫ‌రెంట్ స్టోరీల‌తో సినిమాలు తెర‌కెక్కించే లింగుస్వామి ఓ ప్రెష్ స్టోరీతో బ‌న్నీ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇందుకోసం బ‌న్నీ త‌న లుక్‌ను సైతం మార్చుకునే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ట‌. ఇక త్వ‌ర‌లోనే సెట్స్‌ మీద‌కు వెళ్ల‌నున్న ఈ సినిమా టీం చాలా వ‌ర‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాకు బ‌న్నీకి బాగా క‌లిసొచ్చిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. బ‌న్నీ-దేవీ కాంబినేష‌న్‌ లో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఆరు సినిమాలు మ్యాజిక‌ల్ హిట్స్‌ గా నిలిచాయి. ఆ సెంటిమెంట్‌ తోనే ఈ సినిమాకు కూడా దేవీనే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ గా ఎంపిక చేశారు.

తెలుగు - త‌మిళ భాష‌ల్లో భారీ బ‌డ్జెట్‌ తో తెర‌కెక్కే ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం హీరోయిన్‌ తో పాటు ఇత‌ర సాంకేతిక నిపుణుల‌ను ఎంపిక చేసే ప‌నిలో ద‌ర్శ‌కుడు లింగుస్వామి బిజీబిజీగా ఉన్నారు. తెలుగుతో పాటు కేర‌ళ‌లో మంచి మార్కెట్ ఏర్ప‌రుచుకున్న బ‌న్నీ ఈ సినిమాతో కోలీవుడ్ మీద కూడా కాన్‌ సంట్రేష‌న్ చేశాడు.