Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీ ఫిక్స్

By:  Tupaki Desk   |   22 Sept 2016 11:20 AM IST
అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీ ఫిక్స్
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి టాలీవుడ్ లోనే మల్లూవుడ్ లో కూడా బోలెడంత డిమాండ్ ఉంది. వేరే రాష్ట్రంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకోగలిగిన మొదటి తెలుగు స్టార్ హీరోగా బన్నీకి రికార్డు ఉంది. సౌత్ అంతా దీన్ని విస్తరించాలనే ఆలోచన అల్లు అర్జున్ కి ముందు నుంచి ఉండడంతో.. కోలీవుడ్ లో ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు.

ఇప్పుడు బన్నీ-లింగుస్వామి ప్రాజెక్టు ఓకే అయిందని.. ఇవాళో రేపో దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావచ్చని తెలుస్తోంది. 'తెలుగు-తమిళ భాషల్లో బైలింగ్యువల్ గా ఓ చిత్రం తెరకెక్కనుండగా.. ఇది బన్నీకి తొలి తమిళ్ మూవీ కానుంది' అంటున్నారు సన్నిహితులు. గతంలో తమిళ్ డబ్బింగ్ మూవీస్ ఉన్నా.. డైరెక్టుగా తమిళ్ లో చేయడం మాత్రం ఇదే మొదలు అవుతుంది. నిజానికి లింగుస్వామితో ప్రాజెక్టుపై గతంలోనే చర్చలు జరిగాయి. కానీ కొన్ని విబేధాల కారణంగా ఇది ఆగిపోయింది. ఆ తర్వాత వేరే స్టోరీతో జూనియర్ ఎన్టీఆర్ ని కలిశాడు లింగుస్వామి. అది కూడా ఇంకా పట్టాలెక్కలేదు.

దీంతో లింగుస్వామిని పిలిపించి మాట్లాడుకుని.. డిఫరెన్సులను తొలగించి ప్రాజెక్టును మొదలుపెట్టేందుకు రంగం సిద్ధం చేశాడట స్టైలిష్ స్టార్. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో దువ్వాడ జగన్నాధం స్టార్ట్ చేయనున్న బన్నీ.. లింగుస్వామి ప్రాజెక్టును కూడా మొదలుపెట్టేస్తాడట. రెండు సినిమాలు ఏకకాలంలో షూటింగ్ జరగనున్నాయని సమాచారం.