Begin typing your search above and press return to search.

వాళ్లకు చాలా త్వరగా వచ్చింది - నాకు మాత్రం 20 సినిమాలకు వచ్చిందిః బన్నీ

By:  Tupaki Desk   |   12 Jan 2021 3:45 AM GMT
వాళ్లకు చాలా త్వరగా వచ్చింది - నాకు మాత్రం 20 సినిమాలకు వచ్చిందిః బన్నీ
X
అల్లు అర్జున్‌ సుదీర్ఘ సినీ కెరీర్ లో గత ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా గత ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆల్‌ టైమ్‌ రికార్డును సొంతం చేసుకోవడంతో పాటు బన్నీ కెరీర్‌ ఎప్పటికి నిలిచి పోయే సినిమాగా నిలిచింది. గత ఏడాది నెం.1 సినిమాగా కూడా అల వైకుంఠపురంలో నిలిచింది. అందుకే చిత్ర యూనిట్‌ సభ్యులు సరిగ్గా ఏడాది అయిన సందర్బంగా రీ యూనియన్‌ కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్బంగా బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రతి నటుడికి హీరోకి ఏదో ఒక సమయంలో ఆల్‌ టైమ్‌ రికార్డు పడుతుంది. పవన్‌ గారికి 7వ సినిమాతో ఖుషికి రికార్డు పడింది. ఎన్టీఆర్‌ కు కూడా ఏడవ సినిమాతో పడింది. చరణ్‌ కు రెండవ సినిమాతో ఆల్‌ టైమ్ రికార్డు పడింది. కాని నాకు మాత్రం ఆల్ టైమ్ రికార్డు పడటం లేదే అని ఎదురు చూస్తున్న సమయంలో ఈ సినిమా పడింది. వారికి చాలా త్వరగానే ఆల్ టైమ్‌ రికార్డు పడింది. కాని నాకు మాత్రం 20 సినిమాల తర్వాత ఆల్ టైమ్ రికార్డు దక్కింది అన్నాడు.

తప్పకుండా ఇకపై నా సినిమాలు మరో లెవల్‌ లో ఉంటాయి అన్నట్లుగా అభిమానులకు బన్నీ హామీ ఇచ్చాడు. ప్రస్తుతం బన్నీ చేస్తున్న పుష్ప సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా కూడా బన్నీకి మరో ఆల్‌ టైమ్ రికార్డును కట్టబెట్టడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.