Begin typing your search above and press return to search.

'ఎఫ్ 3' సెట్స్ లో పుష్పరాజ్ ఫన్..!

By:  Tupaki Desk   |   6 Oct 2021 6:33 AM GMT
ఎఫ్ 3 సెట్స్ లో పుష్పరాజ్ ఫన్..!
X
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ''పుష్ప'' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో లారీ డ్రైవర్ పుష్పరాజ్ అనే ఊర మాస్ పాత్రలో బన్నీ కనిపించనున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ఫస్ట్ పార్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. అయితే ఈరోజు బుధవారం బన్నీ ఉన్నట్టుండి ''ఎఫ్ 3'' సెట్స్ ని సందర్శించి చిత్ర బృందాన్ని సర్ప్రైజ్ చేశారు.

విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''ఎఫ్ 3''. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రధాన తారాగణం అంతా పాల్గొనే ఓ హిలేరియస్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ సమయంలోనే అల్లు అర్జున్ సెట్స్ కు వెళ్లి టీమ్ అందరితో కాసేపు ముచ్చటించారు.

'ఎఫ్ 3' సెట్స్ కు బన్నీ విచ్చేసిన విషయాన్ని తెలియజేస్తూ.. మేకర్స్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. వీటిల్లో వెంకటేష్ - వరుణ్ తేజ్ - రాజేంద్ర ప్రసాద్ - సునీల్ - వెన్నెల కిషోర్ - దర్శకుడు అనిల్ రావిపూడి లతో అల్లు అర్జున్ ముచ్చటిస్తున్నారు. అనుకోకుండా బన్నీ ఈ సెట్స్ కి రావడంతో అక్కడ సందడి నెలకొందని తెలుస్తోంది.

కాగా, సూపర్ హిట్ 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫస్ట్రేషన్' ఫ్రాంచైజీలో మరింత ఫన్ ని జోడించి ''ఎఫ్ 3'' చిత్రాన్ని రూపొందిస్తున్నారు అనిల్ రావిపూడి. ఇందులో వెంకటేష్ సరసన తమన్నా భాటియా.. వరుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ కౌర్ నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై దిల్ రాజు - శిరీష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.