Begin typing your search above and press return to search.

మహేష్ బాబు అడ్డాలో అల్లు అర్జున్ జోరు

By:  Tupaki Desk   |   16 Jan 2020 12:12 PM IST
మహేష్ బాబు అడ్డాలో అల్లు అర్జున్ జోరు
X
ఓవర్సీస్ మార్కెట్ లో మొదటి నుంచి మహేష్ బాబు ఆధిపత్యమే. బాహుబలి లాంటి స్పెషల్ సినిమాలు తప్ప జనరల్ గా చూస్తే మహేష్ బాబు ఓవర్సీస్ ట్రాక్ రికార్డ్ ఏ ఇతర సౌత్ హీరోకు కూడా లేదు. అయితే ఈ సారి సంక్రాంతి సినిమాల విషయంలో మాత్రం మహేష్ బాబుకు అల్లు అర్జున్ గట్టిపోటీ ఇస్తున్నారు.

మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11 న విడుదల కాగా.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' జనవరి 12 న రిలీజ్ అయింది. ఒక రోజు ముందుగా రిలీజ్ అయిన ఎడ్వాంటేజ్ ఉంది కాబట్టి మహేష్ సినిమా కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మంగళ వారం కలెక్షన్స్ తో అల్లు అర్జున్ సినిమా మహేష్ సినిమా కలెక్షన్లను దాటే దిశగా పయనిస్తోంది. మంగళవారం నాడు 'అల వైకుంఠపురములో' $209k కలెక్షన్స్ జోడించడంతో టోటల్ కలెక్షన్ $1.78 మిలియన్ కు చేరింది. ఇదిలా ఉంటే 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్ మంగళవారం నాడు '$1.79 మిలియన్ గా ఉంది. దీన్ని బట్టి చూస్తే బన్నీ సినిమా ఓవర్సీస్ లో మహేష్ సినిమాను దాటేస్తోందని అర్థం అవుతుంది.

త్రివిక్రమ్ కు ఓవర్సీస్ లో ఫాలోయింగ్ ఎక్కువ. పైగా ఓవర్సీస్ ప్రేక్షకులు క్లాస్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తారు. దీంతో 'అల వైకుంఠపురములో' సినిమాకు ఎడ్వాంటేజ్ ఎక్కువగా ఉంది. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మాస్ ఎంటర్టైనర్ కావడంతో ఓవర్సీస్ లో ఎక్కువ ప్రభావం చూపించడం కష్టమే. మహేష్ బాబు స్టార్ డమ్ పని చేసింది కాబట్టే ఈ స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. ఫుల్ రన్ కలెక్షన్స్ చూస్తే కానీ ఏ సినిమా సత్తా ఎంత అనేది తెలియదు. ఒకటి మాత్రం నిజం.. డల్ గా ఉన్న యూఎస్ మార్కెట్ కు ఇద్దరు సంక్రాంతి హీరోలు మంచి ఊపు మాత్రం తీసుకొచ్చారు.