Begin typing your search above and press return to search.
సరికొత్త లుక్ లో స్టైలిష్ స్టార్
By: Tupaki Desk | 16 March 2023 9:51 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాని రిలీజ్ చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో షూటింగ్ కాస్తా నెమ్మదిగానే నడుస్తుంది. పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అంతకు మించి ఈ సినిమా ఉండాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. కచ్చితంగా పుష్ప 2తో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాలని బన్నీ టార్గెట్ గా పెట్టుకున్నట్లు టాక్.
ఇదిలా ఉంటే ఓ వైపు సినిమా చేస్తూనే మరో వైపు కమర్షియల్ యాడ్స్ కూడా అల్లు అర్జున్ చేస్తున్నాడు. ఇక ఈ యాడ్స్ కోసం డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా స్టైలిష్ స్టార్ కి సంబందించిన న్యూ లుక్ పోస్టర్ ని ఆహా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్టర్ పై ఇంటరెస్టింగ్ ట్వీట్ కూడా పెట్టింది.
ఐకాన్ స్టార్ ని మీరు మాస్ గా, క్లాస్ గా చూసి ఉంటారు. ఈ సారి బ్లాక్ బస్టర్ లుక్ తో ఆహా మీ ముందుకి తీసుకొని వస్తుంది.
ది బిగ్గెస్ట్ ఎనౌన్స్ మెంట్ కోసం సిద్ధంగా ఉండండి అని ట్వీట్ చేశారు. అయితే బిగ్గెస్ట్ ఎనౌన్స్ మెంట్ ఏమై ఉంటుంది అనేది సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది. ఆహా ఒటీటీలో అల్లు అర్జున్ కి సంబందించిన బిగ్గెస్ట్ ఎనౌన్స్ మెంట్ అంటే అతనితో ఏదైనా రియాలిటీ షో ప్లాన్ చేస్తున్నారా అనే ప్రశ్న కూడా వస్తుంది.
లేదంటే ఒక వేళ ఆహా కోసం స్పెషల్ గా యాడ్ షూట్ ఏమైనా చేసారేమో అని కూడా ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఈ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో టి-సిరీస్ నిర్మించే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. ఈ మూవీ 2025లో స్టార్ట్ కావొచ్చు అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.