Begin typing your search above and press return to search.

2020 నెటిజ‌నుల‌ శోధ‌న‌లో టాలీవుడ్ నంబ‌ర్ హీరో

By:  Tupaki Desk   |   3 Dec 2020 2:30 AM GMT
2020 నెటిజ‌నుల‌ శోధ‌న‌లో టాలీవుడ్ నంబ‌ర్ హీరో
X
భారతదేశంలో అత్యధికంగా శోధించిన టాప్ -10 ప్రముఖులలో అల్లు అర్జున్ పదవ స్థానంలో నిలిచారు. ఆయ‌న ద‌రిదాపుల్లో వేరొక టాలీవుడ్ హీరో ఎవ‌రూ లేక‌పోవ‌డం విశేషం. ఈ ఏడాది జూన్ ‌లో విషాద‌క‌ర మ‌ర‌ణంతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి గూగుల్ లో అత్యధికంగా శోధించారు. ఆ త‌ర్వాత బిగ్ బి అమితాబ్ బచ్చన్ రెండవ స్థానంలో నిలిచారు.

ఈ జాబితాలో దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (# 7).. సోను సూద్ (# 9).. అక్షయ్ కుమార్ (# 3).. సల్మాన్ ఖాన్ (# 4).. ఇర్ఫాన్ ఖాన్ (# 5) ఉన్నారు.

దక్షిణ భారతదేశం నుండి అల్లు అర్జున్ ఈ సంవత్సరం నెటిజన్లు ఎక్కువగా శోధించిన ఏకైక మేల్ స్టార్ గా నిలిచారు. `బుట్టా బొమ్మా` ఘ‌న‌త ఇది. 2020 సంక్రాంతికి రిలీజైన అల వైకుంఠ‌పుర‌ములో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డం ఇందులో పాట‌లు చార్ట్ బ‌స్ట‌ర్లు గా నిల‌వ‌డంతో బ‌న్ని పేరు మార్మోగింది. అందుకే బ‌న్నికి ఈ ఘ‌న‌త ద‌క్కింద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ఓటీటీలో ఎన్ని సినిమాలు రిలీజైనా ఓటీటీ స్టార్ల‌కు అంత‌గా ప్రాధాన్య‌త ద‌క్క‌లేద‌ని గూగుల్ స‌ర్వే ప్రూవ్ చేసింది.

జనవరి ఫిబ్రవరి నెలల్లో విడుదలైన సినిమాలు తప్ప ఆ త‌ర్వాత కోవిడ్ లాక్ డౌన్ వ‌ల్ల‌.. వేరే ఏ సినిమాలు థియేట్రిక‌ల్ రిలీజ్ కాలేదు. ఓటీటీ రిలీజ్ లేవీ ఆన్ ‌లైన్ ‌లో ట్రెండ్ కాలేదు. అప్ప‌టికే విడుద‌లైన అల వైకుంఠ‌పుర‌ములో తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యింది.