Begin typing your search above and press return to search.

సేనాప‌తిలా మేక‌ప్ రూమ్ కే 2గంట‌లు అంకితం

By:  Tupaki Desk   |   23 Aug 2021 2:30 AM GMT
సేనాప‌తిలా మేక‌ప్ రూమ్ కే 2గంట‌లు అంకితం
X
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ `భార‌తీయుడు` సేనాప‌తి లుక్ కోసం రోజుకు 4 గంట‌లు మేక‌ప్ కే టైమ్ కేటాయించేవార‌ని విన్నాం. ఆ త‌ర్వాత ద‌శావ‌తారం కోసం అంత‌కు డ‌బుల్ ట్రిపుల్ టైమ్ మేక‌ప్ రూమ్ కే అంకిత‌మ‌య్యేవారు. ఇటీవ‌ల విశ్వ‌రూపం వేష‌ధార‌ణ కోసం మేక‌ప్ కి ఎక్కువ శ్ర‌మించారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా క‌మ‌ల్ హాస‌న్ ని స్ఫూర్తిగా తీసుకున్నారా అనిపిస్తోంది. అతడు న‌టిస్తున్న పుష్ప కోసం ప్రాణం పెట్టి ప‌ని చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ పుష్పలో బ‌న్ని పూర్తి మాస్ అవ‌తారంలో క‌నిపించ‌నున్నారు. మోటైన పాత్ర కోసం అద్భుతమైన మేకోవర్ తో స‌ర్ ప్రైజ్ చేస్తున్నారు. ఈ పాత్ర‌లో ఊర‌మాస్ కి ప‌రాకాష్ట‌గా క‌నిపించ‌నున్నార‌ని ఇంత‌కుముందు రివీలైన విజువ‌ల్స్ చెబుతున్నాయి. ఇందులో భయంకరమైన ఎర్రచందనం స్మగ్లర్ గా బ‌న్ని నటిస్తున్నాడు.

త‌న పాత్ర కోసం అల్లు అర్జున్ ప్రతిరోజూ 2 గంటలు మేకప్ కోసం శ్రమిస్తున్నారు. బాగా మిసిన రింగుల‌జుత్తు గ‌డ్డం.. షేపులు కోల్పోయిన వీర ముదురు గెట‌ప్ కోసం టాన్ టచ్ అప్ లు చేయించుకుంటున్నాడు బ‌న్ని. అల్లు అర్జున్ మేకప్ వేసుకోవడానికి రోజుకు రెండు గంటలు స‌మ‌యం తీసుకుంటున్నాడు. మేక‌ప్ ని తొల‌గించ‌డానికి ఒక గంట సమయం ప్ర‌తిరోజూ కేటాయిస్తున్నారు. `పుష్ప - పార్ట్ 1: ది రైజ్` క్రిస్మస్ రోజు విడుదల కానుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న .. ఫహద్ ఫాజిల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.