Begin typing your search above and press return to search.
మీకు మీరే రియలైజ్ అవ్వాలి -అల్లు అర్జున్
By: Tupaki Desk | 19 July 2017 4:53 PM IST''సింగపూర్ లో తప్పు చేయడం కుదరదు. కెమెరాలు పట్టేసుకుంటాయి. కాని మన దేశంలో అలా కాదు కదా. అందుకే ఎన్ని రూల్స్ పెట్టినా కూడా మనం వేరే కొత్త రూటు ఒకటి కనిపెడతాం. అందుకే ట్రాఫిక్ విషయంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎవరికి వారికి సెల్ఫ్ రియలైజేషన్ ఉంటేనే ఇక్కడ మంచి పద్దతులు అలవాటవుతాయి'' అంటున్నాడు అల్లు అర్జున్. ట్రాఫిక్ అవేర్నెస్ మీట్ కు ముఖ్య అతిథిగా దర్శకదిగ్గజం రాజమౌళితో పాటుగా పాల్గొన్న స్టయిలిష్ హీరో.. మాంచి ఇంప్రెసివ్ గా మాట్లాడాడనే చెప్పాలి.
''ఇంటర్నేషనల్ ఆర్జనైజేషన్లు వచ్చి రెండే విషయాల్లో మన గురించి జడ్జ్ చేస్తారట. ఒకటి మన శానిటేషన్ ఫెసిలిటీస్ చూసి మన గురించి చెప్పేస్తారట. ఇంకోటి మన ట్రాఫిక్ చూసి.. మనం ట్రాఫిక్ లో ఎలా వెళ్తున్నామో చూసి మన కామెన్ సెన్స్ అండ్ సివిక్ సెన్స్ గురించి చెప్పేస్తారట. మా ఇంటి రోడ్డు చివరే నా బెస్ట్ ఫ్రెండ్ ఇల్లు ఉంది. కాకపోతే నేను రోడ్డు చివరకు వెళ్ళి రైట్ తిరిగితే వాడి ఇల్లు వచ్చేస్తుంది. కాని అలా చేస్తే అది రూల్ ను పాటించినట్లు కాదు. అందుకే అందరూ నన్ను చాదస్తం అన్నా కూడా నేను లెఫ్ట్ తీసుకుని ముందకెళ్లి యు-టర్న్ తీసుకునే వాడింటికి వెళ్తాను. నన్ను చూసి ఎవ్వరూ మారలేదు.. నా డ్రైవర్ ఒక్కడే మారాడు. నాకు అది చాలు'' అన్నాడు అల్లు అర్జున్. ''రోడ్ల మీద కారు నడుపుతున్నప్పుడు మన చేతిలో స్టీరింగ్ ఉంటే అక్కడ మన లైఫ్ ఒక్కటే కాదు.. ఇతరుల లైఫ్ కూడా మన కంట్రోల్ లో ఉంటుంది. మనం తప్పుచేస్తే వేరే వారికి ప్రమాదం జరిగే చాన్సుంది. మన కారణంగా ఇంకో కుటుంబానికి చెందిన బ్రెడ్ విన్నర్ కు ఏమన్నా అయితే.. జీవితంలో వారికి ఆ లోటును భర్తీ చేయలేం. మన లైఫును మనం రిస్కులో పెట్టుకుని ఏదన్నా చేద్దాం అనుకుంటే హీరోయిజం కాని.. పక్కనోళ్ళ లైఫ్ ను రిస్కులో పెడితే అది హీరోయిజం అనిపించుకోదు'' అని చెప్పాడు. ఎప్పుడన్నా మందు కొడితే ఏదన్నా యుబర్ ఓలా వంటి క్యాబులో ఇంటికి చేరుకోవాలని.. లేదంటే బ్యాచ్ లో ఎవరన్నా తాగని వారిని కారు నడపమనాలి కాని మనం మాత్రం నడపకూడదు అంటూ సెలవిచ్చాడు.
అలాగే ఈ కార్యక్రమానికి రాజమౌళిని గెస్టుగా పిలవడం అనేదే మంచి పనని చెప్పాడు. ఎందుకంటే రాజమౌళి బాహుబలి సినిమా తీశారని కాదు.. ఆయన ఒకసారి ఒక న్యూ ఇయర్ అర్ధరాత్రి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ కనిపించారని.. అంత పెద్ద హృదయం ఆయనకు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అదే విధంగా 'ఐ యామ్ ది చేంజ్' అనే షార్ట్ ఫిలిం తీయడమే కాదు.. నేను ఆ చేంజ్ కావాలని అనుకుంటాన్ను అని కూడా చెప్పాడు.