Begin typing your search above and press return to search.
కొత్త హీరోకి బ్లెస్సింగ్.. దటీజ్ బన్ని!
By: Tupaki Desk | 23 Jan 2019 4:54 PM GMTహీరోలు ఎందరు ఉన్నా బన్ని వేరు. అతడి ఎప్రోచ్ వేరు. నవతరంలో ఎవరైనా ప్రతిభావంతులు ఉంటే ప్రోత్సహించడం బన్ని పద్ధతి. కొత్త హీరో అయినా - కొత్త దర్శకుడు అయినా నచ్చితే వెంటనే తనవంతు ప్రోత్సాహం ఇస్తుంటాడు. ఒరు ఆధార్ లవ్ టీజర్ చూసి ఆ సినిమా హీరో - హీరోయిన్ ఇద్దరినీ అభిమానించాడు బన్ని. ఆ టీజర్ వచ్చిన వెంటనే ప్రియా వారియర్ కు తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. రకరకాల కారణాలతో ప్రియా ఆ అవకాశం వదులుకోవాల్సొచ్చింది కానీ - ఈ పాటికే ఈ అమ్మడి పేరు మార్మోగిపోయేదే.
నేడు హైదరాబాద్ జేఈఆర్ సీ ఈవెంట్ లో ఈ చిన్న సినిమా ఫంక్షన్ ఎంతో వైభవంగా సాగింది. సుఖీభవ డెవలపర్స్ అధినేత గురురాజ్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తూ వేడుకను అంతే ఘనంగా జరిపించారు. ఈ వేదికపై కొత్త కుర్రాడు రోషన్ ని - ప్రియాని బన్ని ప్రత్యేకంగా అభినందించారు. కెరీర్ పెద్ద రేంజుకు ఎదగాలని ఆశీస్సులు అందించారు. ఇక తనకు బన్ని అంటే ఎంతో ఇష్టమని ప్రియా వారియర్ ఆనందం వ్యక్తం చేసింది.
ఈ వేదికపై బన్ని మాట్లాడుతూ -``ఇటీవల జాతీయ స్థాయిలో వైరల్ అయిన వీడియో కొలవెరిడి.. బాహుబలి- హూ కిల్డ్ కట్టప్ప .. అవి ఎంతో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత అంత వైరల్ అయ్యింది ఒరు ఆధార్ లవ్ టీజర్. నాకు సౌతిండియా అంటే ఇష్టం. నేనెవరో చెప్పాల్సి వస్తే.. సౌతిండియన్ హీరో అని అంటాను. నాకు గర్వం కలిగించే విషయమిది. నేను పుట్టింది హైదరాబాద్.. పెరిగింది చెన్నయ్ .. తెలుగు - తమిళంతో పాటు కేరళ - కర్నాటక లోనూ ఆదరిస్తున్నారు. అందుకే నేనే సౌత్ ఇండియన్ నే. నన్ను మలయాళంలో ఎంతో ఆదరించారు. నా సినిమాల్ని వాళ్లు ఆదరిస్తున్నందుకు అయినా.. వాళ్ల సినిమాలు మన భాషలోకి వచ్చేప్పుడు ఎంకరేజ్ చేయాలి కదా అనిపించి ఈ వేడుకకు వచ్చాను. టీమ్ కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాకి ఇంత క్రేజు తెచ్చిన హీరో రోషన్ అబ్ధుల్ .. ప్రియా వారియర్ కి కంగ్రాట్స్`` అని అన్నారు. వేడుక అయిపోయాక హీరో రోషన్ - ప్రియా ఇద్దరినీ పిలిచి మరీ బన్ని ప్రత్యేకంగా శుభాభివందనలు తెలిపారు. దటీజ్ బన్ని కల్చర్ అన్నమాట!!