Begin typing your search above and press return to search.
బన్నీ-సుక్కు.. ఆర్యను మించే సినిమా?
By: Tupaki Desk | 1 Nov 2015 7:12 AM GMTఅల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య’ ఓ ట్రెండ్ సెట్టర్. ఆ సినిమాతో బన్నీ కెరీర్ మలుపు తిరిగింది. సుకుమార్ టాలీవుడ్లోకి డైరెక్టర్ గా బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లోనే ‘ఆర్య’కు సీక్వెల్ గా ‘ఆర్య-2’ వచ్చింది. ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయినా.. మంచి సినిమాగానే గుర్తింపు తెచ్చుకుంది. మళ్లీ ఈ కాంబినేషన్లో ఇంకో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. ‘కుమారి 21 ఎఫ్’ ఆడియో ఫంక్షన్లో బన్నీ ఫ్యాన్స్ ‘ఆర్య-3’ కోసం డిమాండ్ చేశారు కూడా. దీనికి బదులిస్తూ ఆసక్తికర విషయం చెప్పాడు బన్నీ.
‘‘సుకుమార్, నేను మళ్లీ సినిమా చేస్తున్నాం. ఐతే ఆర్య-3 కాదు, ఆర్య సినిమాను మరిపించేలా వేరే సినిమా చేయబోతున్నాం’’ అని చెప్పాడు బన్నీ. అభిమానుల్ని ఊరడించడానికి ఊరికే ఆ మాట చెప్పినట్లు లేదు బన్నీ. బోయపాటితో ‘సరైనోడు’ తర్వాత బన్నీ సుకుమార్ తోనే సినిమా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇక సుకుమార్ తో తన అనుబంధం గురించి ఆడియో ఫంక్షన్లో బన్నీ మాట్లాడుతూ.. ‘‘సుక్కు నా బెస్ట్ ఫ్రెండ్. మేమందరం కుమారి.. సినిమా విషయంలో ఏదో చేశాం అంటున్నాడు. అతనెలాంటివాడో నేను చెబుతా. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఓ షార్ట్ ఫిలిం చేశాం. ఐతే ఇండిపెండెన్స్ డే ఇంకో నాలుగు రోజులే ఉండగా ఎవరితో చేయాలా అని చూస్తున్నాం. కాన్సెప్ట్ రెడీగా ఉంది. అప్పుడు సుక్కుకు ఫోన్ చేసి ఆఫీస్ కి రమ్మన్నా. రాగానే షార్ట్ ఫిలిం సంగతి చెప్పాను. చేస్తానా, చెయ్యనా ఏమీ చెప్పకుండా నేరుగా పనిలోకి వెళ్లిపోయాడు. నేను రెమ్యూనరేషన్ అన్న మాట ఎత్తగానే కోపంగా నావైపు చూశాడు. నేను ‘అలాంటిదేమీ ఉండదు’ అని చెప్పాను’’ అని నవ్వేశాడు బన్నీ.