Begin typing your search above and press return to search.
గీత గోవిందులతో బన్నీ పార్టీ
By: Tupaki Desk | 16 Aug 2018 1:59 PM GMTఆరెక్స్ 100 తర్వాత చెప్పుకోదగ్గ సక్సెస్ లేక బాగా డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ కు ఏకంగా సునామి జోష్ ఇస్తూ గీత గోవిందం సక్సెస్ సాధించడం గురించే ఎక్కడ చూసినా టాక్ నడుస్తోంది. సింపుల్ లవ్ స్టోరీని కొత్త తరహా ట్విస్ట్ తో దర్శకుడు పరశురామ్ నడిపించిన తీరుకు సర్వత్రా ప్రశంశలు దక్కుతున్నాయి. ఇక అర్జున్ రెడ్డికి పూర్తి వ్యతిరేకంగా ఉన్న పాత్రలో విజయ్ దేవరకొండ మేకోవర్ ని చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. గీతా ఆర్ట్స్ కొంత గ్యాప్ తర్వాత సాధించిన బ్లాక్ బస్టర్ గా కూడా గీత గోవిందం స్పెషల్ గా నిలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అల్లు అరవింద్ ప్రత్యేకంగా హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ ఉన్న తన పర్సనల్ ఫామ్ హౌస్ లో స్పెషల్ పార్టీ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ఇది శనివారం ఫుల్ జోష్ మధ్య జరగనుందని టాక్. తాను నటించిన సినిమా కాకపోయినా తమ స్వంత బ్యానర్ పై నాన్న అల్లు అరవింద్ ఫ్రెండ్ బన్నీ వాస్ తీసిన సినిమా కాబట్టి ఈ మాత్రం ఆనందం ఉండటం సహజమే.
గీత గోవిందం ఇంకొన్ని రోజులు ఇదే కిక్ లో మునిగితేలనుంది. ఆదివారం సక్సెస్ మీట్ కూడా ప్లాన్ చేసారు. చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్న ఈ వేడుకను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయట. చిరు మొదటి రోజే గీత గోవిందం చూసి టీమ్ ను ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడని చిరు అన్ని స్టేజి మీద పబ్లిక్ గా షేర్ చేసుకుంటాను అని చెప్పడంతో ప్రెస్ మీట్ లాంటిది ఏది పెట్టలేదని తెలిసింది. మరోవైపు ట్విట్టర్ లో గీత గోవిందం మీద ప్రశంశల వర్షం కురుస్తూనే ఉంది. రాజమౌళి మొదలుకుని చిన్న చిన్న యాక్టర్స్ వరకు అందరు గీత గోవిందంల ప్రేమలో పడుతున్నారు. లాంగ్ వీక్ ఎండ్ ని ఫుల్ గా వాడుకోబోతున్న గీత గోవిందం ఫైనల్ గా షాక్ ఇచ్చే ఫిగర్లే నమోదు చేయనుంది.