Begin typing your search above and press return to search.

అఖండ విజ‌యానికి బ‌న్ని స్పెష‌ల్ పార్టీ?

By:  Tupaki Desk   |   13 Dec 2021 5:30 AM GMT
అఖండ విజ‌యానికి బ‌న్ని స్పెష‌ల్ పార్టీ?
X
టాలీవుడ్ లో హీరోలంద‌రినీ క‌లిపి పార్టీలు ఫంక్ష‌న్లు అంటూ ఒక మంచి క‌ల్చ‌ర్ ని సృష్టించేందుకు అల్లు అర్జున్ - రానా లాంటి స్నేహితుల బృందం ప్ర‌య‌త్నించింది. టాలీవుడ్ లో అడ‌పాద‌డ‌పా ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. ఏ ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లో లేని ఒక మంచి సాంప్ర‌దాయ‌మిది. స్టార్ హీరోలంతా ఒక‌రితో ఒక‌రు స్నేహంగా క‌లుస్తుంటారు. ఒక‌రి వేడుక‌ల‌కు ఒక‌రు అతిథులుగా వెళుతున్నారు.

ఇక‌పోతే సినిమా ఏదైనా విజ‌యం సాధించినా ఆ టీమ్ ని పిలిచి ప్ర‌త్యేకంగా పార్టీ ఇవ్వ‌డం అల్లు అర‌వింద్ - అల్లు అర్జున్ బృందానికి అల‌వాటు. త‌ర‌త‌మ భేధం లేకుండా అంద‌రినీ ప్రోత్స‌హించడం వారి ఉద్ధేశం. ఇప్పుడు బాల‌కృష్ణ న‌టించిన అఖండ ఘ‌న‌విజ‌యం సాధించింది.

ఈ సంద‌ర్భంగా మ‌రో పార్టీకి బ‌న్నీ-అర‌వింద్ బృందం ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌- బోయ‌పాటి ఇరువురిని పిలిచి పార్టీ ఇచ్చేందుకు సిద్ధమ‌వుతున్నారని తెలిసింది.

ఇటీవ‌ల ఆహా-ఓటీటీ వేదిక‌పై బాల‌కృష్ణ స్పెష‌ల్ షో ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇక అఖండ వేదిక‌పై బ‌న్నీ సంద‌డి చేశారు. ఇప్పుడు ఏకంగా పార్టీనే ఇస్తున్నారు. మొత్తానికి నందమూరి- అల్లు బాండింగ్ పై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. రెండు భిన్న ధృవాల క‌ల‌యిక ఇంట్రెస్టింగ్ అంటూ కామెంట్లు ప‌డిపోతున్నాయ్. త‌దుప‌రి బోయ‌పాటితో బ‌న్నీ ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.