Begin typing your search above and press return to search.

పవన్‌ సాంగ్‌ కాబట్టి సరిపోయింది - బన్నీ

By:  Tupaki Desk   |   29 March 2016 9:42 AM
పవన్‌ సాంగ్‌ కాబట్టి సరిపోయింది - బన్నీ
X
ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. దానికి స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్పందించిన తీరు ఇంకా బాగుంది. మొత్తానికి ఈ హ్యాపెనింగ్‌ తో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. పదండి అసలు ఇదేంటో చూద్దాం.

ఆడుకుంటూ ఆడుకుంటూ బన్నీ ఐఫోన్‌ లో కొడుకు అయాన్‌ పాటలు వినడం మొదలెట్టాడు. తీరా ఏమి పాటలా అని చూస్తే అవి ''సర్దార్‌'' గబ్బర్‌ సింగ్ పాటలు. అయితే సడన్‌ గా తన ట్విట్టర్‌ పేజీలో చూసుకుంటే సర్దార్‌ ఆడియో ఆల్బమ్‌ గురించి ట్వీట్‌ చేసి ఉంది. ఎందుకిలా జరిగిందబ్బా అని చూస్తే.. అయాన్‌ యాక్సిడెంటల్‌ గా ట్వీటేశాడని అర్ధమైందట మన బన్నీకు. ఇంతలో బన్నీ వాళ్ళావిడ స్నేహ మాట్లాడుతూ.. ''దేవుడా.. పవన్‌ కళ్యాణ్‌ పాట అయి్యంది కాబట్టి సరిపోయింది.. వేరే ఎవరిదైనా అయితేనా..'' అంటూ నిట్టూర్చిందట. ఇదే విషయం బన్నీ తెలిపి.. ఇకమీదట నేను కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటూ సెలవిచ్చాడు.

అవును మరి.. ఇప్పటివరకు కనీసం సర్దార్‌ సినిమా గురించి ఒక్క మాట కూడా ఎప్పుడూ ట్వీట్‌ చేయలేదు కాని.. సడన్‌ గా వేరే ఎవరైనా హీరో సాంగు ఏదైనా ట్వీటు చేసుంటే మాత్రం దాని రియాక్షన్‌ ఇంకోలా ఉండేది. అది సంగతి.