Begin typing your search above and press return to search.

విల్ స్మిత్ వార‌సుడిలా అల్లు వార‌సుడు!

By:  Tupaki Desk   |   28 May 2022 5:32 AM GMT
విల్ స్మిత్ వార‌సుడిలా అల్లు వార‌సుడు!
X
మ‌నం ఏం ఆలోచించినా పెద్ద‌గా ఆలోచించాలి. పెద్ద స్పాన్ ఉన్న ఆలోచ‌న‌లు చేస్తేనే క‌నీసం చిన్న విజయాలు అయినా సాధించ‌గలం అని చెబుతుంటారు. చూస్తుంటే అల్లు అర్జున్ అలాంటి ఆలోచ‌న‌లు చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. తన వార‌సుల విష‌యంలో బ‌న్ని ఆలోచ‌న‌లు చాలా విభిన్నంగా ఉన్నాయి. మీడియా గ్లేర్ కి దూరంగా త‌న కిడ్స్ ని ఉంచేందుకు అత‌డు ఆస‌క్తిగా లేడు. కిడ్స్ ని ఏ మేర‌కు ఎలివేట్ చేయాలో అది త‌న‌కు బాగా తెలుసు. అంత‌వ‌ర‌కూ అత‌డు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

ఇప్ప‌టివ‌ర‌కూ గారాల ప‌ట్టీ అల్లు అర్హ‌ను హైలైట్ చేస్తూ సోష‌ల్ మీడియాల్లో బోలెడ‌న్ని యాక్టివిటీస్ క‌నిపించాయి. బుల్లి అర్హ అప్పుడే డెబ్యూ న‌టిగా కూడా ప‌రిచ‌యం అయిపోతోంది. గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లంతో ఇది సాధ్య‌మ‌వుతోంది. ఇక అల్లు అయాన్ టైమ్ కూడా స్టార్ట‌య్యింద‌న‌డానికి ఒక ఆధారం ల‌భించింది ఇప్పుడు. తాజాగా బన్నీ షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ దానికి ఇచ్చిన క్యాప్ష‌న్ ఒక్క‌సారిగా అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి.

త‌న న‌ట‌వార‌సుడు అల్లు అయాన్ ని బ‌న్ని కొత్త కోణంలో ప‌రిచ‌యం చేసారు. ఆ మిర్ర‌ర్ సెల్ఫీలో డాడ్ బ‌న్నీతో పాటు అయాన్ ఇచ్చిన ఫోజు సంథింగ్ స్పెష‌ల్ గా కొత్త ఆలోచ‌న‌లను రేకెత్తిస్తోంది. దీనికి "మై నింజా బాబు!"అంటూ బ‌న్నీ ఆస‌క్తిక‌ర‌ క్యాప్ష‌న్ ఇచ్చాడు. దానికి త‌గ్గ‌ట్టే అల్లు అయాన్ పూర్తిగా మార్ష‌ల్ విద్య‌లు తెలిసిన నిపుణుడిలా ఫోజిచ్చాడు. మిర్ర‌ర్ సెల్ఫీలో అయాన్ ఫోజ్ రియల్లీ స్ట్రైకింగ్ అని చెప్పాలి. దీనికి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడే క‌రాటే కిడ్ గా ఎదిగేసాడా? విల్ స్మిత్ వార‌సుడిలా ఎద‌గాలి! అంటూ కొంద‌రు అభిమానులు సూచిస్తున్నారు.

నిజానికి టాలీవుడ్ లో యాక్ష‌న్ హీరోయిజానికి బ‌న్నీ ఒక ప‌ర్ఫెక్ట్ మీనింగ్ చెప్పారు. అందుకే త‌న న‌ట‌వార‌సుడిని పూర్తిగా మార్ష‌ల్ విద్య‌ల్లో రాటు దేలేలా తీర్చిదిద్దుతున్నాడ‌ని భావిస్తున్నారు. భ‌విష్య‌త్ లో అల్లు అయాన్ ఏం అవుతాడ‌న్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్.

కానీ అత‌డిలో స్కిల్స్ విష‌యంలో ఎక్క‌డా త‌గ్గేదేలే! అన్న‌ట్టుగా తీర్చిదిద్దే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని టాక్. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత క‌థానాయ‌కుడు విల్ స్మిత్ న‌ట‌వార‌సుడు జేడెన్ స్మిత్ 14ఏళ్ల వ‌య‌సులో అసాధార‌ణ ఫీట్స్ తో ఆక‌ట్టుకుంటున్నాడు. న‌టుడిగా ర్యాప‌ర్ గానూ రాణిస్తున్నాడు. మార్ష‌ల్ ఆర్ట్స్ లోనూ నైపుణ్యం సంపాదించిన జేడెన్ స్మిత్ 'ది క‌రాటే కిడ్' అనే చిత్రంలో అద్భుతంగా న‌టించాడు. ఆఫ్ట‌ర్ ఎర్త్ అనే భారీ ఫిక్ష‌న్ చిత్రంలో డాడ్ విల్ స్మిత్ తో క‌లిసి అద్భుత న‌ట‌నతో అల‌రించాడు.

పుష్ప 2 పైనే ఫోక‌స్...'పుష్ప: ది రైజ్‌'కి సీక్వెల్ కోసం సుక్కూ అండ్ టీమ్ వ‌ర్క్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దర్శకుడు సుకుమార్ 'పుష్ప 2' లో బ‌న్నీని మ‌రో లెవ‌ల్లో ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. పుష్ప 2 మొదటి భాగం కంటే చాలా పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నార‌ని ఇటీవ‌ల టాక్ వినిపించింది. మొదటి భాగం అంచనాలకు మించి విజయం సాధించడంతో బడ్జెట్ ను పెంచి యాక్షన్‌ సీక్వెన్స్ ని మ‌రో లెవ‌ల్లో మెరుగుపరిచార‌ని స‌మాచారం. 'KGF - చాప్టర్ 2' సంచ‌ల‌న విజ‌యం సాధించిన అన్ని పాత‌ రికార్డులను బద్దలు కొట్టడంతో సుకుమార్ దీనిని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. అందుకే పుష్ప 2 స్క్రిప్టు విష‌యంలో రాజీకి రాలేద‌ని టాక్ వినిపించింది. సూప‌ర్ హీరో త‌ర‌హా క్వాలిటీస్ తో పుష్ప‌రాజ్ కి యాక్ష‌న్ ప‌రంగా ట‌చ‌ప్ ఇస్తున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.