Begin typing your search above and press return to search.

కాస్ట్ లీ వెకేష‌న్ ముగించి బ‌న్నీ రిలాక్స్ డ్ గా!

By:  Tupaki Desk   |   15 April 2022 4:30 AM GMT
కాస్ట్ లీ వెకేష‌న్ ముగించి బ‌న్నీ రిలాక్స్ డ్ గా!
X
పుష్ప‌- ది రైజ్ సుదీర్ఘ షెడ్యూళ్ల షూటింగ్.. అనంత‌రం ప్ర‌మోష‌న్స్ తో ఎంతో అల‌సిసొల‌సిన దేహానికి పూర్తిగా విశ్రాంతినిచ్చారు అల్లు అర్జున్. పుష్ప ఘ‌న‌విజ‌యం అత‌డిలో మునుప‌టి కంటే ఎక్కువ ఎన‌ర్జీని నింపింద‌ని చెప్పాలి. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా స‌రికొత్త అవ‌తార్ తో బ‌రిలో దూక‌నున్నాడు. పుష్ప 2 తో మ‌రో లెవ‌ల్ అని నిరూపించాల‌ని క‌సితో క‌నిపిస్తున్నాడు.

సుకుమార్ ఇప్ప‌టికే పార్ట్ 2 కి ముహూర్తం పెట్టుకుని రెడీగా ఉన్నాడు. అయితే అంత‌కుముందు యూర‌ప్ అందాల న‌డుమ ఫ్యామిలీతో ఫుల్ రిలాక్స్ అయ్యి సిద్ధ‌మ‌య్యాడు బ‌న్ని. అల్ట్రా రిచ్ ప‌ర్య‌ట‌న‌ను ముగించి తాజా లుక్ తో రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. తాజాగా లీకైన ఫోటోలు చూస్తే ఆ విష‌యం అర్థ‌మ‌వుతోంది.

బ‌న్నీ తన భార్య స్నేహ ఇతర స్నేహితులతో కలిసి పార్టీలతో చిల్ అయిన వైనం క‌నిపిస్తోంది ఈ ఫోటోల్లో. ఇక ఈ ఫోటోల‌న్నిటినీ స్నేహా ఎంతో యాక్టివ్ గా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. తాజాగా షేర్ చేసిన ఫోటోలో సుందరమైన జంట రెస్టారెంట్ లో వారి స్నేహితులతో పోజులిస్తూ క‌నిపించారు. బ‌న్నీ తన 40వ పుట్టినరోజును జరుపుకోవడానికి యూరప్ కి వెళ్లాడు. హ్యాపీ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. స్పెష‌ల్ డే కి సంబంధించి ఎమోష‌న‌ల్ నోట్ ని రాసాడు.

చిరంజీవి- డేవిడ్ వార్న‌ర్ సహా సమంత రూత్ ప్రభు- రష్మిక మందన్న- సుకుమార్ - హన్సిక మోత్వాని సహా పలువురు ప్రముఖులు బ‌న్నీకి అందమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంత‌లోనే అల్లు అర్జున్ - స్నేహ ట్రిప్ ముగించి తిరిగి వ‌స్తూ విమానాశ్రయంలో కనిపించారు. త్వరలో పుష్ప రెండవ భాగాన్ని బ‌న్నీ ప్రారంభించనున్నారు. పుష్ప: ది రూల్ అనే టైటిల్ తో ఈ ఏడాది జూలైలో సినిమా మొదటి షెడ్యూల్ ను ప్రారంభించాలని సుకుమార్ భావిస్తున్నారు