Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మాక్సిమ్‌ పై స్టైలిష్ స్టార్

By:  Tupaki Desk   |   8 Feb 2018 8:20 AM GMT
ఫోటో స్టోరి: మాక్సిమ్‌ పై స్టైలిష్ స్టార్
X
టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్. సినిమా సినిమాకు హెయిర్ స్టైల్‌ను, కాస్ట్యూమ్స్‌లోనూ తేడా చూపిస్తూ... స్టైలిష్ లుక్స్ తో అద‌ర‌గొడ‌తాడు. ఇప్పుడు అంతే స్టైలిష్‌గా మాక్సిమ్ స్టీడ్ మ్యాగ‌జైన్ పై క‌వ‌ర్ పేజీగా మెరిశాడు.

నా పేరు సూర్య సినిమాలో అల్లు అర్జున్ సైనికుడు. అత‌ని హెయిర్ క‌ట్ అందుకు త‌గ్గ‌ట్టే చేశారు. అందులోనూ చాలా స్టైల్‌గా ఉన్నాడు బ‌న్నీ. ఇప్పుడ‌దే హెయిర్ స్టైల్ తో ప్ర‌ముఖ మ్యాగ‌జైన్ మాక్సిమ్ స్టీడ్ కు మోడ‌ల్ గా మారాడు. బ్లాక్ బ్లేజ‌ర్ సూట్ లో, ప‌దును చూపులతో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ లైన్ కు అర్థాన్నిచ్చేలా క‌నిపిస్తున్నాడు. టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్ కూడా మాక్సిమ్ క‌వ‌ర్ పై మెరిసింది. మాక్సిమ్ ప‌త్రిక కేవ‌లం అమ్మాయిల కోసం అయితే... మాక్సిమ్ స్టీడ్ అబ్బాయిల కోసం రూపొందుతోంది.

ప్ర‌స్తుతం అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ షూటింగ్ మ‌ధ్య‌లో మాక్సిమ్ స్టీడ్ ఫోటోగ్రాఫ‌ర్‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టున్నాడు అంటున్నారు సినీజ‌నాలు. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న నా పేరు సూర్య సినిమా షూటింగ్ చివ‌ర‌లో ఉంది. ఏప్రిల్‌లో విడుద‌ల చేసేందుకు చిత్ర‌యూనిట్ ప్లాన్ చేస్తోంది.