Begin typing your search above and press return to search.

యాక్షన్ సీన్స్ తో బన్నీ బిజీ

By:  Tupaki Desk   |   28 Aug 2017 12:52 PM GMT
యాక్షన్ సీన్స్ తో బన్నీ బిజీ
X
మెగా ఫ్యామిలీ నుంచి పరిచయం అయినా ఆ తర్వాత కొన్ని రోజులకే తనకంటూ ఓ.ప్రత్యేక స్టార్ స్టామినాను సంపాదించుకున్న హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. గత సినిమా డీజే దువ్వాడ జగన్నాథమ్ విమర్శల పాలు కావడంతో ఈ సారి మంచి హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత బన్నీ ఒక కొత్త తరహా కథతో రాబోతున్నాడు.

తనకు రేసుగుర్రం లాంటి మంచి కథను ఇచ్చిన వక్కంతం వంశీ డైరెక్షన్ లో " నా పేరు సూర్య" అనే సినిమాతో రాబోతున్నాడు అల్లు అర్జున్. ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కొన్ని మిలిటరీ సన్నివేశాల్ని హిమాచల్ ప్రదేశ్ - గుజరాత్ - జమ్ము రాష్ట్రాల్లో ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతానికి ఆ షెడ్యూల్ ని వదిలేసి యాక్షన్ సీన్స్ ని పూర్తి చేస్తున్నాడు దర్శకుడు వంశీ. ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తుండగా విలన్ గా శరత్ బాబు నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమా కోసం బన్నీ చాలా కష్టపడుతున్నాడట. మొదటి లుక్ లొనే దేశ సైనికుడిగా స్ట్రాంగ్ గా కనిపించాలని చూస్తున్నాడట. అలాగే అతని లుక్ కోసం అమెరికా నుంచి ఓ ఫిజికల్ ఫిట్ నెస్ ట్రైనర్ ను కూడా రప్పించారు. ఇక రచయిత వక్కంతం వంశీ తన మొదటి సినిమాని చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. బన్నీ సరసన అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్ - శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు.